Srikakulam: విద్యుత్ షాక్‌తో గాయపడిన బాలకృష్ణ కుటుంబానికి ఉద్దానం ఆసరా

Srikakulam: కవిటి మండలం శ్రీహరిపురంలో విద్యుత్ షాక్‌తో తీవ్రంగా గాయపడిన బాలకృష్ణ కుటుంబానికి 'సిక్కోలు ఉద్దానం సేవా సమితి' రూ.10,000 ఆర్థిక సాయం అందించింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 14 Aug 2026 1:41 PM IST
Srikakulam
X

Srikakulam: విద్యుత్ షాక్‌తో గాయపడిన బాలకృష్ణ కుటుంబానికి ఉద్దానం ఆసరా

Srikakulam: కష్టాల్లో ఉన్న కుటుంబానికి సిక్కోలు ఉద్దానం సేవా సమితి అండగా నిలిచింది. కవిటి మండలం శ్రీహరిపురం గ్రామానికి చెందిన చొట్ట బాలకృష్ణ ఇటీవల వర్షాల కారణంగా ఇంటి సమీపంలో చెట్టు పడిపోవడంతో దాన్ని తొలగించే క్రమంలో ప్రమాదానికి గురయ్యారు. చెట్టు కింద విద్యుత్‌ తీగలు ఉన్న విషయం తెలియకపోవడంతో ఒక్కసారిగా విద్యుత్‌ సరఫరా రావడంతో షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

బాలకృష్ణకు ఇద్దరు చిన్నపిల్లలు ఉండటంతో పాటు కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. ఇప్పటికే చికిత్స కోసం అప్పులు చేసి పెద్ద మొత్తంలో ఖర్చు చేయడంతో ప్రస్తుతం మరింత ఆర్థిక భారం మోయలేని పరిస్థితి నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న సిక్కోలు ఉద్దానం సేవా సమితి సభ్యులు వెంటనే స్పందించి బాలకృష్ణ కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందించారు.

ఆపదలో ఉన్న వారికి తమవంతు సహకారం అందిస్తూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని సమితి సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రంజిత్, దేవరాజు, ప్రశాంత్, సంతోష్, కార్తీక్, తిరుపతి, మోహనరావు, హరి, ఢిల్లీ, పోడియ దేవరాజు తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story