Tekkali: టెక్కలిలో గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు నిందితుల అరెస్ట్
Tekkali: నిందితుల నుండి 2.155 కేజీల గంజాయి స్వాధీనం.. ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన ఎస్‌హెచ్‌ఓ విజయ్ కుమార్
Tekkali: టెక్కలిలో గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు నిందితుల అరెస్ట్
Tekkali: గంజాయి రవాణా రవణ జరుగుతుందని ముందస్తు సమాచారంతో ముగ్గురు నిందితులును 16-06-2026 తేదీన నిందితులను పోలీసులు పట్టుకున్నారు,
టెక్కలి లో స్థానిక సర్వమంగళ ITI కాలేజీ లో చదువుతున్న మెలియాపుట్టి మండలానికి చెందిన అంగిరేకుల దిలీప్(19)మరియు స్థానిక టెక్కలి భూలోక మాత వీధికి చెందిన కళింగపట్నం కేశవ (22) వ్యసనాలకు బానిసై గంజాయి అమ్మడానికి సిద్ధమై గంజాయిని సరఫరా చేసే ఒడిస్సా కి చేసిన సభాపతి బారికి అనే వ్యక్తికి గంజాయి కావాలని కోరడం తో ఇద్దరు నిందితులకు సరఫరా చేస్తున్న సమయంలో ముందస్తు సమాచారం అందుకున్న టెక్కలి పోలీస్ బృందం వారిని అరెస్ట్ చేశారు.
పలు వ్యసనాలకు బానిస అవడం వలనే యువత ఇటువంటి అడ్డదారులు తొక్కే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు,
ప్రతి గ్రామంలో లో ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ఎన్నో హెచ్చరికలు చేసినప్పటికీ యువత ఇంకా తప్పుడు మార్గాలనే ఎంచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, యువత లో పూర్తిస్థాయి మార్పు తెచ్చేంత వరకు తమ వంతు కృషి చేస్తానని తెలిపారు.




