Tekkali: ఎస్సీ వర్గీకరణ దళితుల ఐక్యతపై కుట్ర ఆర్ఎస్ రత్నాకర్
Tekkali: ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణతో మాల సామాజిక వర్గం ఉనికి కోల్పోతోందని, ఇది దళితుల ఐక్యతపై జరుగుతున్న రాజకీయ కుట్ర అని మాల మహానాడు నేత ఆర్ఎస్ రత్నాకర్ ఆరోపణ.
Tekkali: ఎస్సీ వర్గీకరణ దళితుల ఐక్యతపై కుట్ర ఆర్ఎస్ రత్నాకర్
టెక్కలి: దేశవ్యాప్తంగా ఉన్న దళితుల ఐక్యత పై రాజకీయంగా కుట్ర చేయాలనే దురుద్దేశంతోనే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ- మాల మహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ డా" ఆర్ఎస్ రత్నాకర్. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణతో మాల సామాజిక వర్గం పూర్తిగా ఉనికి కోల్పోయిందంటూ టెక్కలి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు.
ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల పై దేశవ్యాప్తoగా రాజకీయ కుట్ర జరుగుతుందంటూ తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో చట్టం చేసేంతవరకు నిరంతరం శాంతియుత పోరాటం కొనసాగుతుంది అని తెలిపారు.
అసలు ఈ ఎస్సీ వర్గీకరణను శాంపుల్ గా పంజాబ్ హర్యానాలో మొట్టమొదటిగా ఈ దేశంలో చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే, వర్గీకరణ కు బీజం కాంగ్రెస్ పార్టీ వేస్తే దీన్ని దేశం దేశ ప్రధాని మోదీ అమలుపరిచారని, నిజానికి ఎస్సీ రిజర్వేషన్ వల్ల వందలో 1-2 కి బెనిఫిట్ జరుగుతోంది అని, ఇది కూడా అధికారిక లెక్క కాదు,ఈ వందలో యిద్దరికిచ్చే ఈ ఫలాలను, సమన్యాయం, సామాజిక న్యాయం పేరుతో దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్న 1108 ఎస్సీ కులాలకు ఎలా పంచుతారు మోడీ గారు అని ప్రశ్నించారు.
అలాగే ఎస్సీ కులాలకు రాజకీయంగా అందుబాటులో ఉంచే ఒకటి, రెండు సీట్లను తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలకు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఎలా పంచుతారు, ఇది దళితుల ఐక్యత పై కుట్ర కాదా అని ప్రశ్నించారు. సామాజిక న్యాయం దళితులకు ఇచ్చే రిజర్వేషన్లలో మాత్రమేనా ఈ దేశ సంపదలో అక్కర్లేదా?
మరియు తెలుగు రాష్ట్రాల క్యాబినెట్లో మంత్రి పదవుల విషయంలో సామాజిక న్యాయం అవసరం లేదనుకుంటున్నారా అంటూ ప్రజల తలుచుకుంటే ఏ చట్టాలైన ప్రభుత్వాలు ప్రజాస్వామ్యంలో వెనక్కి తీసుకోవాల్సిందే, తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తా ఉంటే మాల ప్రజా ప్రతినిధులు నోరు మెదపకపోవడం.
ఘోరం అన్యాయం అంటూ మండిపడ్డారు, చెంచా గిరికి అలవాటు పడ్డ మాల నాయకులు రాజకీయ పార్టీలకు విశ్వాసంగా ఉన్నారే తప్ప జాతి పట్ల విశ్వాసంగా లేరన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి అని తెలిపారు, తెలుగు రాష్ట్రాల్లో ఏ నాడు ఎదుర్కొనటువంటి గడ్డు పరిస్థితిని మాల సామాజిక వర్గం ఈరోజు ఎదుర్కొంటూ ఉంది, పూర్తిగా తెలుగు రాస్ట్రాల్లో మన కులం తన ఉనికిని కోల్పోఇంది ,
ఎస్సీ వర్గీకరణ చట్టం రద్దు చేయకపోతే
శాంతియుత పోరాటానికి సిద్ధం అవుతాం అంటూ తిరుగుబాటు వ్యక్తం చేసిన రత్నాకర్.




