Kaviti: కవిటి శ్రీ కళ్యాణి పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం!

Kaviti: కవిటి శ్రీ కళ్యాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ఉపాధ్యాయ దినోత్సవం.. సర్వేపల్లి సేవలను స్మరించుకున్న ఏవో రాణి, ఉపాధ్యాయులకు సన్మానం.

G.RAMBABU, SOMPET
Published on: 5 Sept 2026 3:46 PM IST
Kaviti
X

Kaviti: కవిటి శ్రీ కళ్యాణి పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం!

Kaviti: కవిటి మండలం కేంద్రంలోని శ్రీ కళ్యాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా సర్వేపల్లి చిత్రపటం వద్ద ఓ రాణి జ్యోతి ప్రజ్వలన చేయగా ప్రిన్సిపాల్ బిందు మాధవి సర్వేపల్లి ఫోటోకు పూలమాల అలంకరణ చేశారు. అనంతరం విద్యార్థులు డైరెక్టర్ రమేష్ ఉపాధ్యాయులకు సాలువుతో సత్కరించి చిరు కానుకలను ఇచ్చారు.

అనంతరం సర్వేపల్లి రాధాకృష్ణ యొక్క జీవిత చరిత్ర గూర్చి సోషల్ టీచర్ జానకి రామ్ విద్యార్థులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే పల్లి రాధాకృష్ణన్ గొప్ప సంస్కారవత్తని అతని యొక్క అడుగుజాడలలో ఎంతోమంది విద్యార్థులు ఉన్నత శిఖరాలు ఆశించారని అన్నారు. ఆయన సమాజ నిర్దేశికుడని భారతదేశానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివని తెలిపారు.

భారతదేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా రెండవ రాష్ట్రపతిగా రాజ్యాంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి అని విద్యార్థులకు తెలియజేశారు కొనసాగిస్తూ ఉన్నత శిఖరాలకు వెళ్లాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story