Palakonda: ఘనంగా జ్యోతిబా పూలే వేడుకలు.. టీడీపీ ఇంచార్జ్ పడాల భూదేవి నివాళి
Palakonda: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.
Palakonda: ఘనంగా జ్యోతిబా పూలే వేడుకలు.. టీడీపీ ఇంచార్జ్ పడాల భూదేవి నివాళి
పార్వతీపురం మన్యం జిల్లా: పాలకొండ కేంద్రంలో టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు. టీడీపీ ఇంచార్జ్ పడాల. భూదేవి
పాలకొండ మండలం లో రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్. మండల కన్వీనర్ గండి రామినాయుడు ఆధ్వర్యం లో సంఘ సంస్కర్త శ్రీ జ్యోతి బా పూలే జయంతి వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా పాలకొండ టీడీపీ ఇంచార్జ్ శ్రీమతి. పడాల. భూదేవి గారు పాల్గొన్నారు. జ్యోతిబా పూలే చిత్రపటానికి పుష్పంజలి ఘటించి నివాళి అర్పించారు. జ్యోతిబా పూలే అణగారిన వర్గాల ప్రజలకోసం చేసిన కార్యక్రమాలను కొనియాడారు. స్త్రీలపై నాడున్న కట్టుబాట్లు ను ఊళ్ళంఘిస్తూ మహిళల మహోద్ధరణకు కృషి చేసారు.అంతటితో ఆగక బాలికలకోసం 1848 లో పాఠశాల ఏర్పాటుచేసారు.బాల్యవివాహాలు,శిషు హత్యలు నివారించుటకు కృషి చేసారు. అని అన్నారు. ఈ కార్యక్రమం లో తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గండి రామినాయుడు,అరకు పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు వారాడ.సుమంత్ నాయుడు, వంజరాపు. ఈశ్వరరావు, మరియు బీసీ ముఖ్యనాయకులు, AMC డైరెక్టర్ మూర మోహనరావు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




