Srikakulam: కిన్నెరవాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. కాలువలో పడ్డ కారు!
Srikakulam: శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం కిన్నెరవాడ వద్ద వంశధార కాలువలో కారు బోల్తా పడిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు గల్లంతయ్యారు.
Srikakulam: కిన్నెరవాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. కాలువలో పడ్డ కారు!
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం కిన్నెరవాడ గ్రామం వద్ద వంశధార నది కాలువలో మారుతి బెలోనో కారు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. కారు కాలవల్లో దూసుకుపోయిన వెంటనే డ్రైవర్‌ను స్థానికులు కాపాడారు. కారులో మరో ఇద్దరు ఉన్నట్లు డ్రైవర్ సమాచారం ఇవ్వడంతో కారుని వెలుగు తీయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి.
స్థానికులు పోలీసులు చెప్పిన వివరాలు ప్రకారం సారవకోట మండలం గోపాలపురం ఎంపీటీసీ పంగ అప్పారావు కుమారుని వివాహము VBR కళ్యాణ మండపం నందు జరుగుచున్నది పెళ్లి కుమార్తె ది కోటబొమ్మాలి మండలం శ్రీపురం గ్రామం పెండ్లి కుమార్తె చిన్నాన్న అయిన పీసా రాము తండ్రి లేటు సూర్యనారాయణ వయస్సు సుమారు 50 సం .అతని మేనల్లుడు మెండ విశాల్ కుమార్ తండ్రి లేటు ప్రభాకర్ రావు వయసు 26 సం. ఖర్గపూర్ నివాసి. 11:30 గంటల సమయంలో వీబిఆర్ కళ్యాణ మండపము నుండి AP 39HR 1027 నెంబర్ గల బెలోనో కారులో బయలుదేరి పార్వతీపురంలో చదువుకుంటున్న అతని కుమార్తె ను తీసుకొని రావటానికి వెళ్ళుచుండగా కిన్నెర వాడ గ్రామం దగ్గరకు వచ్చేసరికి కారు డ్రైవరు గొతివాడ నాగరాజు ఎదురుగా రోడ్డు ప్రక్కన నిలిపి ఉన్న బొలెరో వ్యాన్ ను ఢీ కొట్టినందున కారు అదుపుతప్పి కాలువలో తిరగబడిందినీ స్థానికులు పోలీసులు తెలుపుతున్నారు.
ఆ సమయంలో అటుగా వస్తున్న అవలింగి గ్రామానికి చెందిన మోహన గాంధీ వెంకటరమణ ఇద్దరు వ్యక్తులు కారు నదిలో కొట్టుకుపోవడానికి గమనించి వెంకటరమణ అనే వ్యక్తి సాహసంతో నదిలోకి దూకి అద్దాలని పగలగొట్టి డ్రైవర్ నాగరాజును కాపాడారు. కాలువలో నీటి ప్రవాహము అధికంగా ఉండటం గుర్రపు డెక్క కాలువలోని చెత్త ఉండడం వల్ల కారు సుమారు 15 నుంచి 20 అడుగుల లోతుకి దిగిపోవడంతో ఆ కారులో ఉన్న ఇద్దరినీ రక్షించడానికి ప్రయత్నాలు చేసినా ప్రవాహం వల్ల చేయలేకపోయామని స్థానికులు తెలిపారు. ఫైర్ సిబ్బంది పోలీసులు స్థానికేతగాళ్లు కాలువ నుండి కారుని ఇప్పుడే కారు నీ బయటికి తీయగా అందులో రాము మృతదేహం ఒకటే లభ్యం అయింది. మృతుని మేనల్లుడు విశాల్ కుమార్ మృతదేహం ఇంకా లభ్యం కాలేదు అని స్థానికులు తెలిపారు.




