Srikakulam: అప్పుల ఊబిలో రొయ్యల రైతులు.. ఆక్వా రైతుల నిరసన!
Srikakulam: శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో ఆక్వా రైతులు రోడ్డు ఎక్కారు.
Srikakulam: అప్పుల ఊబిలో రొయ్యల రైతులు.. ఆక్వా రైతుల నిరసన!
Srikakulam: స్టేట్ ఆక్వా ఫెడరేషన్ పిలుపు మేరకు ఈ రోజు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలానికి చెందిన ఆక్వా రైతులు మండల తహసీల్దార్ ద్వారా ప్రభుత్వానికి వినతిపత్రం అందజేశారు.
ప్రస్తుతం ఆక్వా ఫీడ్ ధరలు విపరీతంగా పెరగడం వల్ల ఆక్వా రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతులు తెలిపారు. ఆక్వా రంగానికి విదేశీ మార్కెట్లలో మంచి డిమాండ్ ఉన్నప్పటికీ, రైతులు మాత్రం నష్టాలను చవిచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల ఆక్వా ఫీడ్ కంపెనీలు ఫీడ్ ధరలను సుమారు 20 శాతం వరకు పెంచడంతో సాగు ఖర్చులు భారీగా పెరిగాయని పేర్కొన్నారు. మరోవైపు రొయ్యల అమ్మకపు ధరలు 20 శాతం వరకు తగ్గిపోవడంతో రైతులకు పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు.
ఈ పరిస్థితుల కారణంగా ఆక్వా రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తూ అప్పుల భారంతో సతమతమవుతున్నారని తెలిపారు. కావున ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని పెంచిన ఆక్వా ఫీడ్ ధరలను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని, ఆక్వా రైతులకు తగిన న్యాయం చేయాలని కోరుతూ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.




