Srikakulam: జడ్పీ సమావేశ మందిరంలో గ్రీవెన్స్ డే.. ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్!

Srikakulam: శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు.

Varaprasad, Staff Reporter -Srikakulam
Published on: 6 Sept 2026 6:28 PM IST
Srikakulam
X

Srikakulam: జడ్పీ సమావేశ మందిరంలో గ్రీవెన్స్ డే.. ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్!

శ్రీకాకుళం: సోమవారం అనగా రేపు 07వ తేదీన ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించ బడుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన జారీ చేశారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నేరుగా పై కార్యక్రమములో లేదా ఆన్లైన్ లో Meekosam.ap.gov.in (మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్) వెబ్సైట్ లో అర్జీలు నమోదు చేసుకోవచ్చునని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

రెవెన్యూ క్లినిక్ ఉంటుందని, భూ సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపారు. అర్జీదారుల అర్జీల నమోదు, నమోదైన అర్జీల గురించి వాటి యొక్క స్థితి దానికి సంబంధించి సమాచారం గూర్చి తెలుసుకోవాలంటే 1100 (డబల్ వన్ డబల్ జీరో)కి నేరుగా కాల్ చేయవచ్చని వివరించారు. అర్జీదారులు గమనించి నేడు నిర్వహించే ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Varaprasad, Staff Reporter -Srikakulam

Varaprasad, Staff Reporter -Srikakulam

మూడు దశాబ్దాలకు పైగా (36 ఏళ్లు) సుదీర్ఘ అనుభవంతో, శ్రీకాకుళం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story