Srikakulam: సెప్టెంబర్ 11న స్థానిక ఓటర్ల జాబితా ప్రచురణ.. జెడ్పీ సీఈఓ!

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ల జాబితా సెప్టెంబర్ 11న ప్రచురణ. వివరాలు వెల్లడించిన జిల్లా పరిషత్ సీఈఓ ఆర్.వెంకట్రామన్.

Varaprasad, Staff Reporter -Srikakulam
Published on: 10 Sept 2026 3:12 PM IST
Srikakulam
X

Srikakulam: సెప్టెంబర్ 11న స్థానిక ఓటర్ల జాబితా ప్రచురణ.. జెడ్పీ సీఈఓ!

Srikakulam: స్థానిక సంస్థల రెండవ సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసి ప్రచురించేందుకు జిల్లా ప్రజా పరిషత్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని జిల్లా పరిషత్ సి.ఈ.ఓ ఆర్.వెంకట్రామన్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం సెప్టెంబర్ 11న ఓటర్ల జాబితాను ప్రచురించనున్నామని తెలిపారు.

​ఎం పీ.టి.సి ఓటర్ల జాబితా సంబంధిత మండల పరిషత్ కార్యాలయాలలో అందుబాటులో ఉంటుందనీ, ​జడ్పీటీసీ ఓటర్ల జాబితా జిల్లా పరిషత్ కార్యాలయంలో అందుబాటులో ఉంటుందని తెలిపారు. ​రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి తెలిపారు.

Varaprasad, Staff Reporter -Srikakulam

Varaprasad, Staff Reporter -Srikakulam

మూడు దశాబ్దాలకు పైగా (36 ఏళ్లు) సుదీర్ఘ అనుభవంతో, శ్రీకాకుళం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story