Srikakulam: పొందూరు కాజీపేటలో గ్రామస్తుల వినూత్న నిరసన!
Srikakulam: పొందూరు మండలం కాజీపేటలో చెరువు ఆక్రమణపై గ్రామస్తులు భగ్గు.. అక్రమ కట్టడాలను అడ్డుకుని వినూత్న నిరసన.
Srikakulam: పొందూరు కాజీపేటలో గ్రామస్తుల వినూత్న నిరసన!
Srikakulam: ఇప్పటికే అల్ప వర్షపాతంతో సతమతమవుతున్న రైతులు ఓపక్క, గ్రామీణ ప్రాంతాల్లో చెరువుల్లో నీరు లేక పశువులు గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్న వైనం తెలిసి కూడా కొంతమంది ప్రబుద్ధులు చెరువుల్ని ఆక్రమించుకోవడం చూసినా గ్రామస్తులు అందరూ దీన్ని అడ్డుకున్నారు.
వినూత్నంగా రైతులు గ్రామస్తులు అందరూ ఒక్క తాటిపై నిలిచి చెరువు వద్ద నిరసన కార్యక్రమం తెలిపారు. అధికారులు కళ్ళు మూసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాంతాల్ని సందర్శించిన మీడియాకు వారి ఆవేదన తెలిపారు. ఇది శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కాజీపేట గ్రామాo లో జరిగిన ఘటన.
తమ గ్రామానికి చెందిన చెరువును గ్రామానికి చెందిన కొందరు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని, తమ గ్రామా అవసరాలకు ఉన్న ఏకైక చేరువును ఆక్రమణలకు గురికాకుండా కాపాడాలంటూ నిరసన వ్యక్తం చేపట్టారు గ్రామస్తులు. శ్రీకాకుళం జిల్లా, పొందూరు మండలంలోని కాజీపేట గ్రామానికి చెందిన చెరువును ఆక్రమించి కట్టడాలు రాత్రివేళలో కట్టేస్తుండటంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తమ గ్రామస్తులు నిత్య అవసరాలతో పాటు స్నానాలకు అనుకూలంగా ఉన్న ఏకైక చెరువు ఆక్రమణ చేస్తూ కట్టడాలు కట్టేస్తున్నారని, ఇలా చూస్తూ ఊరుకుంటే రానున్న రోజుల్లో మాకు చెరువు కూడా ఉండదని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇప్పటికే గ్రామంలో ఓ వ్యక్తి తనకు చెందిన భూమి సర్వే నెంబరు చూపి చెరువును ఆక్రమించి చర్చి కట్టేసారని దానిపై ఇప్పటికే పిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని దీంతో మరికొంతమంది ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆక్రమణకు గురైన తమ చెరువును రక్షించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.




