Sompeta: సోంపేట జర్నలిస్టు ఆరోగ్యంపై ఎంపీపీ డాక్టర్ నిమ్మన దాసు ఆరా!
Sompeta: బ్రాహ్మణ కొర్లాం గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన జర్నలిస్టు వి. త్రినాధ్ పట్నాయక్‌ను స్థానిక ఎంపీపీ డాక్టర్ నిమ్మన దాసు పరామర్శించి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు.
Sompeta: సోంపేట జర్నలిస్టు ఆరోగ్యంపై ఎంపీపీ డాక్టర్ నిమ్మన దాసు ఆరా!
సోంపేట: మండలంలోని కొర్లాం పంచాయతీ బ్రాహ్మణ కొర్లాం గ్రామానికి చెందిన జర్నలిస్టు వి. త్రినాధ్ పట్నాయక్ ఇటీవల ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందారు. చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్న ఆయనను సోంపేట ఎంపీపీ డాక్టర్ నిమ్మన దాసు మంగళవారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో తామాడ మోహనరావు, పైడి పట్టాభి, బంగారు పాపారావు, బత్తిన బాలరాజు, కె. శ్రీనివాసరావు, బత్తుల షణ్ముఖరావు, పడాల నరేష్, గుడియా గౌరి శంకర్, కూర్మాపు మోహనరావు, చంటి, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Next Story




