Sompeta: సోంపేటలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి

Sompeta: సోంపేటలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, పలువురు ప్రముఖులు.

G.RAMBABU, SOMPET
Published on: 24 July 2026 9:07 PM IST
Sompeta
X

Sompeta: సోంపేటలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి

సోంపేట: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా సోంపేట లోని అంబేద్కర్ విగ్రహానికి పలువురు ప్రజాప్రతినిధులు, సామాజిక సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సమానత్వం, సామాజిక న్యాయం, విద్య, స్వాభిమానానికి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు, విలువలను ప్రతి పౌరుడు కాపాడాలని, అంబేద్కర్ ఆశయాల సాధనకు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో కోదండరామ ఆలయ చైర్మన్ బీనా ఆనందరావు, జిల్లా కళింగ కమిటీ అధ్యక్షుడు సాన షణ్ముఖరావు, టీడీపీ మండల ఉపాధ్యక్షుడు పొందూరు రాజు, బీనా ఈశ్వర్, బెనర్జీ మాస్టర్, కాంచన రాఘవదాస్, దున్న జోగారావు, మడ్డు రాజారావు, గేదెల భీమారావు, దుద్ది చిరంజీవి, వాసు, వికలాంగుల సంఘం అధ్యక్షుడు పోకల మోహనరావు, జనసేన నాయకుడు గుజ్జల శంకరరావు తదితరులు పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story