Palakonda: భారమిని మండలంలో విద్యార్థులకు పోక్సో, శక్తి యాప్‌పై అవగాహన
Palakonda: కలెక్టర్ ఆదేశాల మేరకు భామిని మండల పాఠశాలల్లో టీనేజ్ ప్రెగ్నెన్సీ, పోక్సో చట్టం, శక్తి యాప్‌పై అవగాహన కల్పించారు.
Palakonda: భారమిని మండలంలో విద్యార్థులకు పోక్సో, శక్తి యాప్‌పై అవగాహన
పాలకొండ: పాలకొండ శక్తి టీం మరియు పార్వతిపురం వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది పార్వతిపురం మన్యం జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్, కలెక్టర్ గారు ఆదేశాలు మేరకు భామిని మండలం లో ఏకలవ్య మోడల్ స్కూల్ మరియు కళాశాల, అంబేద్కర్ గురుకులం పాఠశాల & కళాశాల, జడ్పీహెచ్ఎస్ స్కూల్ ,ఏపీ మోడల్ స్కూల్ & కళాశాల, గవర్నమెంట్ జూనియర్ కళాశాల లో టీనేజ్ ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే నష్టాలు గురించి చెబుతూ, 18 సంవత్సరాలు లోపు బాల బాలికలపై జరిగే లైంగిక దాడుల కు ఫోక్సొ చట్టం వర్తిస్తుందని చెప్పడం జరిగింది.
బాల్యవివాహాలు చేయడం చట్టం రీత్యా నేరం అని, మన రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత గురించి శక్తియాప్ ఏర్పాటు చేశారని మీ అందరూ ఇంటి దగ్గర నుంచే శక్తి యాప్ లో కంప్లైంట్ చేసుకోవచ్చు అని శక్తి యాప్ లో 11 ఫ్యూచర్స్ ఉంటాయని చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో శక్తి టీం మహిళ హెడ్ కానిస్టేబుల్ సిహెచ్ ప్రకృతాంబ ,రాము రామ్మోహన్, సాహూ మరియు వన్ స్టాప్ సెంటర్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ శాంతి కుమారి , కౌన్సిలర్ పల్లవి, పారామెడికల్ కళ్యాణి, కవిత మేడం , పాఠశాల మరియు కళాశాల ప్రిన్సిపాల్ , ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.




