Kanchili: సీతయ్య ఫౌండేషన్‌కు ప్రతిష్టాత్మక జాతీయ సేవారత్న పురస్కారం

Kanchili: కంచిలి మండలం మండపల్లికి చెందిన సీతయ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులకు బెంగళూరులో జరిగిన వేడుకలో 'నేషనల్ సేవారత్న పురస్కార్-2026' ప్రదానం చేశారు.

G.RAMBABU, SOMPET
Published on: 12 Sept 2026 7:25 PM IST
Kanchili
X

Kanchili: సీతయ్య ఫౌండేషన్‌కు ప్రతిష్టాత్మక జాతీయ సేవారత్న పురస్కారం

Kanchili: కంచిలి మండలం మండపల్లి గ్రామ సమీపంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సీతయ్య ఫౌండేషన్‌కు జాతీయ స్థాయి గౌరవం దక్కింది. ఫౌండేషన్ వ్యవస్థాపకులు గుళ్ల రమేష్, గుళ్ల మోహనరావులకు ‘నేషనల్ సేవారత్న పురస్కార్–2026’ లభించింది.

ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ 15వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం బెంగళూరులోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అభ్యుదయ భవన్‌లో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సేవకులకు పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు. సామాజిక సేవా రంగంలో సీతయ్య ఫౌండేషన్ అందిస్తున్న సేవలను గుర్తించిన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వాహకులు గుళ్ల రమేష్, గుళ్ల మోహనరావులను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు.

సంస్థ వ్యవస్థాపకులు ఎస్. శివరాజు వారి చేతుల మీదుగా పురస్కారాన్ని అందజేసి, శాలువాలతో ఘనంగా సన్మానించారు. మండపల్లి గ్రామ సమీపంలో సీతయ్య ఫౌండేషన్ ద్వారా కొనసాగుతున్న సేవా కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం పట్ల ఫౌండేషన్ నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా గుళ్ల రమేష్, గుళ్ల మోహనరావు మాట్లాడుతూ, తమ సేవలను గుర్తించి జాతీయ స్థాయి పురస్కారంతో సత్కరించడం ఆనందంగా ఉందన్నారు. ఈ గౌరవం తమపై మరింత బాధ్యతను పెంచిందని, ప్రజలకు అవసరమైన సేవలను కొనసాగిస్తామని తెలిపారు. తమ సేవలను గుర్తించి పురస్కారంతో సత్కరించిన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వాహకులు, సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET