Salur: సాలూరులో స్కూల్ గోడ కూలి పదో తరగతి విద్యార్థి మృతి!
Salur: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల గోడ కూలి తుపాకుల అరుణ్ తేజ (14) మృతి. మృతదేహంతో కుటుంబ సభ్యుల ధర్నా.
Salur: సాలూరులో స్కూల్ గోడ కూలి పదో తరగతి విద్యార్థి మృతి!
Salur: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సాలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో స్కూల్ గోడ కూలిపడి ఓ బాలుడు మృతి చెందాడు.
ఈ ఘటనలో సాలూరు రెల్లివీధికి చెందిన తుపాకుల అరుణ్ తేజ (14 సంవత్సరాలు10 th చాడుతున్నాడు) మృతి చెందినట్లు సమాచారం. మరో బాలుడు సొండి ఏకాబ్ గాయపడినట్లు తెలుస్తోంది.సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు పాఠశాలకు చేరుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలోనే మృతదేహంతో కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు.
స్కూల్ గోడ ప్రమాదానికి కారణాలపై అధికారులు విచారణ చేపట్టాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనతో పాఠశాల పరిసరాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.సాలూరులో స్కూల్ గోడ కూలి బాలుడు మృతి... కుటుంబ సభ్యుల ధర్నాతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Next Story




