Kaviti: కవిటిలో మహా మృత్యుంజయ యజ్ఞం: ఎస్ఎంఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు!

Kaviti:శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితుల ఆయురారోగ్యాల సిద్ధి కోసం మహా మృత్యుంజయ యజ్ఞం సతీష్ మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల24న సోమవారం పూజలు

G.RAMBABU, SOMPET
Published on: 22 Aug 2026 9:53 AM IST
Kaviti
X

Kaviti: కవిటిలో మహా మృత్యుంజయ యజ్ఞం: ఎస్ఎంఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు!

Kaviti: కిడ్నీ వ్యాధితో అల్లాడుతున్న ఉద్దానం ప్రాంతానికి భక్తి బలంతో అండగా నిలిచేందుకు సతీష్ మెమోరియల్ ఫౌండేషన్ (ఎస్ఎంఎఫ్) ముందుకు వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, పలాస మండలాలు ఉద్దానం పరిధిలోకి వస్తాయి.

ఈ ప్రాంతంలో కిడ్నీ వ్యాధి కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మిగిలిన కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా కుంగిపోతున్నాయి. ఈ బాధలకు విముక్తి కలిగించేందుకు ఎస్ఎంఎఫ్ వ్యవస్థాపకుడు జీ వాసుదేవ్ ఆధ్వర్యంలో "ఉద్దానం కిడ్నీ బాధితుల ఆయురారోగ్య సిద్ధికి మహా మృత్యుంజయ యజ్ఞం" నిర్వహిస్తున్నారు.

ఈనెల 24 సోమవారం ఉదయం 6 నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఎస్ఎంఎఫ్ అధ్యక్షుడు వాసుదేవ్ తెలిపారు. ఉద్దానం నుంచి కిడ్నీ వ్యాధిని పూర్తిగా తరిమికొట్టడం, బాధితులకు సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయువు ప్రసాదించడం... వైద్యదేవుడైన శ్రీ ధన్వంతరి, మృత్యువును జయించిన మృత్యుంజయ స్వామి అనుగ్రహానికి ఈ మహాయజ్ఞం చేస్తున్నట్లు చెప్పారు.

ఉద్దానం ప్రాంతం కిడ్నీ రహిత ప్రాంతంగా మారాలని, ప్రస్తుత రోగులందరికీ సంపూర్ణ ఆరోగ్యం రావాలని, ప్రతి ఇంట్లో సుఖశాంతులు నెలకొనాలని సంకల్పిస్తున్నట్లు అన్నారు. మరోవైపు మూడు కోలాటం బృందాలతో భారీ నృత్య ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పుణ్యకార్యంలో ఉద్దానం ప్రాంత ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. శ్రమదానం, అర్థదానం, పూజా సామాగ్రి రూపంలో సహాయం చేయాలనుకునేవారు 9553113569 నెంబర్ సంప్రదించాలన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story