Kanchili: కంచిలి తహశీల్దార్ ఆఫీస్‌లో 'సాసా' కార్యక్రమం.. సేవలపై అధికారుల సమీక్ష

Kanchili: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండల తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో శనివారం 'సాసా' (SASA) కార్యక్రమం నిర్వహించారు.

G.RAMBABU, SOMPET
Published on: 18 July 2026 12:53 PM IST
Kanchili
X

Kanchili: కంచిలి తహశీల్దార్ ఆఫీస్‌లో 'సాసా' కార్యక్రమం.. సేవలపై అధికారుల సమీక్ష

Kanchili: కంచిలి మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో శనివారం సాసా కార్యక్రమం నిర్వహించారు. తహశీల్దార్ ఎన్. రమేష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొని ప్రజా సేవల అమలు, ప్రభుత్వ కార్యక్రమాల పురోగతి, శాఖల సమన్వయంపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా తహశీల్దార్ ఎన్. రమేష్ కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వ సేవలు ప్రజలకు వేగంగా, పారదర్శకంగా అందేలా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజల నుంచి అందే వినతులు, ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించడంతో పాటు సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యానికి తావులేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా శాఖల మధ్య సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.

కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ సంతోష్ కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కృష్ణ ప్రసాద్ రౌళో, సీనియర్ , జూనియర్ అసిస్టెంట్లు,వి ఆర్వోలు, రెవెన్యూ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story