Rajam: సంకిలిలో ఫ్యాక్టరీ వ్యర్థాలపై రైతుల ధర్నా.. పొలాలు నాశనం!

Rajam: రాజాం సంకిలిలో ప్యారీ ఫ్యాక్టరీ వ్యర్థాలపై రైతుల ఆందోళన. 80 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, ఇన్ఫెక్షన్లు వస్తున్నాయని ఆవేదన. నష్టపరిహారానికి డిమాండ్.

SRIDHAR, RAJAM
Published on: 26 Aug 2026 12:49 PM IST
Rajam
X

Rajam: సంకిలిలో ఫ్యాక్టరీ వ్యర్థాలపై రైతుల ధర్నా.. పొలాలు నాశనం!

Rajam: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలోని సంకిలి గ్రామం సమీపంలో ఉన్న ప్యారి లిమిటెడ్ ఫ్యాక్టరీపై రైతులు ఆందోళనకు దిగారు. ఫ్యాక్టరీ నుంచి విడుదలవుతున్న వ్యర్థాల కారణంగా తమ పంట పొలాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఆరోపిస్తూ.. ఫ్యాక్టరీ ప్రధాన ద్వారం ఎదుట రైతులు ధర్నా చేపట్టారు.

గత కొంతకాలంగా ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న వ్యర్థాలు తమ వ్యవసాయ భూముల్లోకి చేరుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా మిథనాల్ ఫ్యాక్టరీ నుంచి వస్తున్న వ్యర్థాల ప్రభావంతో సుమారు 70 నుంచి 80 ఎకరాల పంట పొలాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

పంటలు నష్టపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని తెలిపారు. అంతేకాకుండా వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలీలు కూడా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. కాళ్లు, చేతులకు ఇన్ఫెక్షన్లు వస్తున్నాయని.. వ్యర్థాల ప్రభావంతో అనారోగ్యానికి గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.

తమ సమస్యపై ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించాలని రైతులు డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ నుంచి విడుదలవుతున్న వ్యర్థాలపై సమగ్ర విచారణ చేపట్టి, కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యర్థాల కారణంగా నష్టపోయిన రైతులకు తగిన నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

భవిష్యత్తులో మరింత మంది రైతులు, కూలీలు అనారోగ్యానికి గురికాకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

టిక్కర్లు

సంకిలిలో ఫ్యాక్టరీ వ్యర్థాలపై రైతుల ధర్నా.

70 నుంచి 80 ఎకరాల పంట పొలాలు దెబ్బతిన్నాయంటూ ఆరోపణ.

ఫ్యాక్టరీ వ్యర్థాలతో పంటలు నష్టపోతున్నాయంటున్న రైతులు.

వ్యర్థాల ప్రభావంతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయంటూ ఆవేదన.

ఫ్యాక్టరీ వ్యర్థాలపై సమగ్ర విచారణకు రైతుల డిమాండ్.

నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్.

SRIDHAR, RAJAM

SRIDHAR, RAJAM

Next Story