Ichchapuram: పెన్షన్ల కోసం ఎవరికీ రూపాయి ఇవ్వొద్దు: సాది శ్యామ్ ప్రసాద్ రెడ్డి!
Ichchapuram: కొత్త పెన్షన్ల కోసం ఎవరికీ పైసా ఇవ్వొద్దని, నేరుగా సచివాలయాల్లోనే దరఖాస్తు చేసుకోవాలని ఇచ్చాపురం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త సాది శ్యామ్ ప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.
Ichchapuram: పెన్షన్ల కోసం ఎవరికీ రూపాయి ఇవ్వొద్దు: సాది శ్యామ్ ప్రసాద్ రెడ్డి!
ఇచ్చాపురం: రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించిన నేపథ్యంలో అర్హులైన నిరుపేదలు ఎవరూ దళారులను నమ్మి మోసపోవద్దని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సాది శ్యామ్ ప్రసాద్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు.
గత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పారదర్శక పాలన కోసం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల ద్వారానే అర్హులంతా నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీన్ని అదనుగా చూసుకుని కూటమి నాయకులు అమాయక ప్రజలను భయపెట్టి, "తాము చెబితేనే పెన్షన్ వస్తుంది" అని డబ్బులు వసూలు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని తీవ్రంగా ఆరోపించారు.
నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులు ఎవరూ ఇటువంటి బెదిరింపులకు భయపడాల్సిన పనిలేదని, పూర్తి అర్హతలు ఉంటే నేరుగా సచివాలయ సిబ్బందికే దరఖాస్తులు సమర్పించాలని స్పష్టం చేశారు. ఒకవేళ ఏ అధికారి అయినా కూటమి నేతల సిఫార్సుల కోసం ఒత్తిడి తెస్తే, వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని... అలాంటి అధికారుల వివరాలను వైఎస్సార్‌సీపీ ‘డిజిటల్ బుక్’లో నమోదు చేసి వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పేదలకు అందాల్సిన సంక్షేమ ఫలాల్లో దళారీతనాన్ని, అధికారుల నిర్లక్ష్య వైఖరిని సహించేది లేదని చెప్పారు.




