Palakonda: పాలకొండ ఆర్టీసీ డిపోలో ఘనంగా మేడే వేడుకలు
Palakonda: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయం వద్ద అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే ఘనంగా జరిగింది.
Palakonda: పాలకొండ ఆర్టీసీ డిపోలో ఘనంగా మేడే వేడుకలు
పాలకొండ: శ్రమ జీవుల రక్తం నుండి పుట్టిoది ఎర్రజెండా అంతర్జాతీయ కార్మిక దినోత్సవo(మేడే )సందర్బంగ APSRTC పాలకొండ ఎంప్లాయిస్ యూనియన్ కార్యలయం వద్ద జరిగిన జండా వందన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన జోనల్ సెక్రెటరీ బాసూరు కృష్ణమూర్తి. గౌరవ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్, ప్రతినిధులకు మేడే శుభాకాంక్షలు. కామ్రేడ్, 1.5.26, శుక్రవారం, మేడే సందర్భంగా, ఉదయం 10గం ల కు,పాలకొండ,APPTD (RTC)ఎంప్లాయిస్ యూనియన్, కార్యాలయం వద్ద మేడే జెండాను,సీనియర్ ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు వండాన వెంకటరమణమూర్తిLH,ఎం వెంకటరాజు,డ్రైవర్, గారు మే డే జెండాను ఆవిష్కరించి ఉన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిగా హాజరైన, విజయనగరం జోనల్ సెక్రెటరీ భాసురు కృష్ణమూర్తి మాట్లాడుతూ పని గంటల మీద చికాగో నగరంలో కార్మికులు చాలామంది, పోరాటాలు చేసి ఎనిమిది గంటల పని విదానాన్ని తెచ్చుకొనుటకు, ప్రాణాలు అర్పించి వారి రక్తంతో, ఎగరవేసిన, ఎర్రజెండా,మే ఒకటో తేదీన మేడే పండుగ కార్మికులందరూ జరిపించుకొనుట ఆనవాయితిగా వస్తున్నదని, తెలియపరిచారు.అందులో భాగంగా మన ఆర్టీసీలో 1952వ సంవత్సరంలో,ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఎర్రజెండాతో ప్రారంభించ బడినదని అనేక మైనటువంటి పోరాటాలు చేసి ఆర్టీసీ ఉద్యోగుల హక్కులను కాపాడడంలో మొట్టమొదటిలో ఉన్నది.
ఎంప్లాయిస్ యూనియన్ అని,భవిష్యత్తులో కూడా ఉద్యోగుల హక్కులు కాపాడుటకు,ఎంప్లాయిస్ యూనియన్ గా ముందు ఉంటామని,ముఖ్యంగా ఆర్టీసీలో 43 %వేతన సవరణ తెచ్చింది ఎంప్లాయిస్ యూనియన్ అని, అలాగే అప్పటి ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రభుత్వంలో విలీనం చేసి ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించింది ఎంప్లాయిస్ యూనియన్ అని,ఆర్టీసీలో ఒకేసారి సుమారు 20 వేల మంది కాంటాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయించింది ఎంప్లాయిస్ యూనియన్ అని, బి కె మూర్తి, తెలియపరిచారు,ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ m.v s.నారాయణ,, జిల్లా మహిళా నాయకురాలు జె రాములమ్మ,డిపో ప్రెసిడెంట్ ఎంవి సాగర్,డిపో వర్కింగ్ ప్రెసిడెంట్ వివి రమణ,డిపో సెక్రెటరీ ఎల్ దామోదర్ నాయుడు, డిపో కోశాధికారి సిహెచ్ స్వరాజ్యం, మరియు డిపో అండ్ గ్యారేజీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఉన్నారు.




