Razam: బొద్దాంలో చెరువు భూమి కబ్జాపై రైతుల ధర్నా.. చర్యలకు డిమాండ్
Razam: రాజాం మండలం బొద్దాం బండివాని చెరువు ప్రభుత్వ భూమి కబ్జాపై రైతుల ఆందోళన. అక్రమ నిర్మాణాలను తక్షణమే తొలగించాలని అధికారులకు డిమాండ్.
Razam: బొద్దాంలో చెరువు భూమి కబ్జాపై రైతుల ధర్నా.. చర్యలకు డిమాండ్
రాజాం: రాజాం మండలం బొద్దాం గ్రామంలోని బండివాని చెరువు సమీపంలో గురువారం రైతులు ధర్నా నిర్వహించారు. చెరువు పరిసర ప్రభుత్వ భూమిని కొందరు అక్రమంగా ఆక్రమించి షాపులు, ఇతర నిర్మాణాలు చేపట్టారని రైతులు ఆరోపించారు.
రోడ్డు విస్తరణ పేరుతో షాపులను మరింత వెనక్కి జరిపి చెరువు స్థలాన్ని పూర్తిగా కబ్జా చేసే ప్రయత్నం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి అక్రమ నిర్మాణాలను తొలగించి చెరువు భూమిని పరిరక్షించాలని రైతులు డిమాండ్ చేశారు.
Next Story




