Srikakulam: కవిటి పాఠశాలలో వైభవంగా రక్షాబంధన్ వేడుకలు!
Srikakulam: కవిటి కళ్యాణి పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌బాబుకు రాఖీలు కట్టిన విద్యార్థులు.
Srikakulam: కవిటి పాఠశాలలో వైభవంగా రక్షాబంధన్ వేడుకలు!
Srikakulam: కవిటి రక్షాబంధన్ పండుగను పురస్కరించుకుని కళ్యాణి పాఠశాలలో శుక్రవారం విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటుతూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌బాబుకు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
“మీరు మాకు రక్ష.. మేము మీకు రక్ష.. మనమందరం దేశానికి రక్ష” అంటూ విద్యార్థులు చేసిన ప్రతిజ్ఞ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పరస్పరం రాఖీలు కట్టుకోవడంతో పాటు సమాజం, దేశం పట్ల బాధ్యతను గుర్తుచేసేలా ప్రతిజ్ఞ చేయడం కార్యక్రమానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది.
ఈ సందర్భంగా ఓం శాంతి నిర్మల మేడం రక్షాబంధన్ పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. రాఖీ అనేది ప్రేమ, ఆత్మీయత, పరస్పర రక్షణకు ప్రతీక అని పేర్కొన్నారు. చిన్ననాటి నుంచే మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించే అలవాటును పెంపొందించుకోవాలని సూచించారు.
పాఠశాల ప్రిన్సిపాల్ బిందు మాధవి మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు మంచి నడవడిక, క్రమశిక్షణను అలవర్చుకొని బాధ్యతగల పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
అనంతరం విద్యార్థులు ఒకరికొకరు రాఖీలు కట్టుకొని “నువ్వు నాకు రక్ష.. నేను నీకు రక్ష.. మనమిద్దరం దేశానికి రక్ష” అంటూ ప్రతిజ్ఞ చేశారు. ఒకరికొకరు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. దీంతో పాఠశాల ఆవరణలో పండుగ సందడి నెలకొంది. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.




