Sriakulam: పోలీసుల పల్లెనిద్ర శాంతిభద్రతలపై సీఐ తిరుపతిరావు సమీక్ష!

Sriakulam: శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం గరుడభద్రలో సిఐ తిరుపతిరావు పల్లెనిద్ర. రాబోయే సర్పంచ్ ఎన్నికల వేళ శాంతిభద్రతల పరిరక్షణపై గ్రామస్తులతో సమావేశం.

B LOKANADHAM, PALASA
Published on: 22 Aug 2026 9:41 AM IST
Sriakulam
X

Sriakulam: పోలీసుల పల్లెనిద్ర శాంతిభద్రతలపై సీఐ తిరుపతిరావు సమీక్ష!

Sriakulam: వజ్రపుకొత్తూరు మండలం గరుడభద్రలో నిర్వహించిన పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులతో సీఐ తిరుపతిరావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యలు, శాంతిభద్రతల పరిస్థితి, రాబోయే సర్పంచ్ ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై గ్రామస్తులతో చర్చించారు.

సర్పంచ్ ఎన్నికలు గ్రామస్థాయిలో జరిగే కీలకమైన ఎన్నికలని, ఎన్నికల సమయంలో అభ్యర్థులు, రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని సీఐ సూచించారు. ఎన్నికల ఫలితాల విషయంలోనూ ఎలాంటి ఘర్షణలకు దిగకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తితో వ్యవహరించాలని అన్నారు.

ఎన్నికల వేళ అప్రమత్తంగా ఉండాల అని, ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో చిన్నచిన్న వివాదాలు పెద్ద ఘర్షణలకు దారితీయకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యర్థి వర్గాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం, గొడవలకు పాల్పడటం, బెదిరింపులకు దిగడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని తెలిపారు.

గ్రామంలో ఏదైనా సమస్య తలెత్తినా ప్రజలు స్వయంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఎన్నికల ప్రక్రియలో ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తే పోలీసులు చట్టపరంగా స్పందిస్తారని స్పష్టం చేశారు.

ప్రజల సహకారంతోనే ప్రశాంత ఎన్నికలు, ఎన్నికల సమయంలో పోలీసులకు గ్రామస్తులు పూర్తి సహకారం అందించాలని సీఐ తిరుపతిరావు కోరారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, అక్రమ కార్యకలాపాలు లేదా ఘర్షణలకు దారితీసే పరిస్థితులు కనిపిస్తే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

ప్రజలు పరస్పరం సోదరభావంతో వ్యవహరిస్తూ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలని అన్నారు. గరుడభద్ర పంచాయతీలో సర్పంచ్ ఎన్నికలు ఎలాంటి ఉద్రిక్తతలకు తావులేకుండా సజావుగా జరిగేలా పోలీసుల తరఫున అవసరమైన చర్యలు తీసుకుంటామని సీఐ తిరుపతిరావు తెలిపారు.

ఈ సమావేశంలో స్థానిక పోలీసు సిబ్బంది, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొని ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు సహకరిస్తామని తెలిపారు.

B LOKANADHAM, PALASA

B LOKANADHAM, PALASA

Next Story