Srikakulam: కంబాలకొండలో జీవవైవిధ్యం, పర్యావరణ పరిరక్షణపై ప్రత్యక్ష అవగాహన!

Srikakulam: శ్రీకాకుళం పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ విద్యార్థులకు విశాఖపట్నం కంబాలకొండకు విద్యా విహారయాత్ర. ప్రత్యక్ష అవగాహన కల్పించిన ఉపాధ్యాయులు.

Varaprasad, Staff Reporter -Srikakulam
Published on: 10 Sept 2026 8:29 PM IST
Srikakulam
X

Srikakulam: కంబాలకొండలో జీవవైవిధ్యం, పర్యావరణ పరిరక్షణపై ప్రత్యక్ష అవగాహన!

Srikakulam: తరగతి గదిలో పుస్తకాల ద్వారా నేర్చుకున్న విషయాలను ప్రత్యక్ష అనుభవం ద్వారా విద్యార్థులకు సులభంగా అవగాహన కల్పించడమే విద్యా విహారయాత్రల ముఖ్య ఉద్దేశమని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ షోయబ్ స్పష్టం చేశారు.

పీఎం శ్రీ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం కేంద్రీయ విద్యాలయ విద్యార్థులకు విశాఖపట్నంలోని కంబాలకొండ ఎకో టూరిజం పార్క్‌కు విద్యా విహారయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృక్షజాలం, జంతుజాలం, జీవవైవిధ్యం, పర్యావరణ మరియు ప్రకృతి పరిరక్షణ తదితర అంశాలపై విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన కల్పించినట్లు తెలిపారు.

కంబాలకొండలోని వివిధ రకాల వృక్షాలు, ఔషధ మొక్కలు, పక్షులు, జంతువులు, ప్రకృతి వనరులను విద్యార్థులు ఎంతో ఆసక్తిగా పరిశీలించి జీవవైవిధ్య పరిరక్షణలో అడవులు, వన్యప్రాణుల ప్రాధాన్యతను తెలుసుకున్నారని పేర్కొన్నారు.

ప్రకృతిని ప్రేమించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం, జీవవైవిధ్యాన్ని కాపాడటం వంటి విలువలను పెంపొందించేందుకు ఇటువంటి యాత్రలు ఎంతో దోహదపడతాయని ఉపాధ్యాయులు తెలిపారు.

పీఎం శ్రీ పథకం ద్వారా విద్యార్థులకు అనుభవాత్మక అభ్యసనంతో పాటు తరగతి గది వెలుపల ప్రత్యక్ష అభ్యసన అవకాశాలను కల్పిస్తున్నామని ఈడబ్ల్యూటీ ఇన్చార్జి డాక్టర్ బెండి లవకుమార్ వివరించారు. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ విద్యా విహారయాత్రకు వివిధ తరగతుల విద్యార్థులను ప్రత్యేక ఆర్టీసీ బస్సుల్లో తీసుకెళ్లినట్లు చెప్పారు. ప్రతి సంవత్సరం విద్యార్థులందరికీ ఇటువంటి అవకాశాన్ని క్రమం తప్పకుండా కల్పిస్తున్నామని ఆయన సూచించారు.

Varaprasad, Staff Reporter -Srikakulam

Varaprasad, Staff Reporter -Srikakulam

మూడు దశాబ్దాలకు పైగా (36 ఏళ్లు) సుదీర్ఘ అనుభవంతో, శ్రీకాకుళం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story