Amadalavalasa: సరుబుజ్జిలి మండలంలో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు!
Amadalavalasa: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా సరుబుజ్జిలి మండలంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, కేక్ కటింగ్ మరియు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
Amadalavalasa: సరుబుజ్జిలి మండలంలో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు!
Amadalavalasa: జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని సరుబుజ్జిలి మండలంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.మండలంలోని రొట్టవలస గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సరుబుజ్జిలి మండల జనసేన పార్టీ అధ్యక్షులు పైడి మురళీ మోహన్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరిపారు.అనంతరం పార్టీ పిలుపు మేరకు సరుబుజ్జిలి మండల కేంద్రం నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించి ఆముదాలవలస నియోజకవర్గ కేంద్రంలో జరిగిన పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మెగా యూత్ ఫోర్స్ జాయింట్ కన్వీనర్ బగ్గు అప్పలరాజు, జనసేన పార్టీ ఉపాధ్యక్షులు సంఘంశెట్టి తేజేశ్వరావు, తులగపు ధనుంజయ్ రావు, కాగితపల్లి రాంబాబు, మూడడ్ల శ్రీనివాస్, ఊటపల్లి అప్పారావు, మూడడ్ల సత్యనారాయణ, గొల్లపల్లి శ్రీధర్, వాడాడ ఎర్ర నాయుడు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




