Pathapatnam: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి రెడ్డి శాంతి

Pathapatnam: పాతపట్నంలో వైఎస్సార్‌సీపీ రౌండ్ టేబుల్ సమావేశం. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి డిమాండ్.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM
Published on: 4 Aug 2026 4:33 PM IST
Pathapatnam
X

Pathapatnam: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి రెడ్డి శాంతి

పాతపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు, కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ పాతపట్నంలోని వైఎస్సార్‌సీపీ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం ఘనంగా జరిగింది. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ సభ్యురాలు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి నాయకత్వంలో ఈ సమావేశం నిర్వహించారు.

కూటమి ప్రభుత్వం చేపడుతున్న విద్యార్థి, యువజన వ్యతిరేక నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో పలు కీలక డిమాండ్లతో కూడిన తీర్మానాలు చేశారు.

ప్రధాన డిమాండ్లు:

డీఎస్సీ (DSC) అక్రమాలపై సిబిఐ విచారణ: కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ ప్రక్రియలో భారీగా అక్రమాలు జరిగాయని, దీనిపై తక్షణమే సిబిఐ (CBI) చేత సమగ్ర విచారణ జరిపించాలి. డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి.

నిలిచిపోయిన విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు యువతకు నెలకు ₹3,000 చొప్పున నిరుద్యోగ భృతిని తక్షణమే వారి ఖాతాల్లో జమ చేయాలి.

ఈ కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గ పరిధిలోని మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, వివిధ అనుబంధ విభాగాల ప్రతినిధులు, అలాగే రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు మరియు వైఎస్సార్‌సీపీ సమరయోధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM

A.SANTHOSH KUMAR, PATHAPATNAM

Next Story