Pathapatnam: పాతపట్నంలో వ్యవసాయ డీజిల్ ఇంజిన్ చోరీ: పోలీసులకు ఫిర్యాదు!

Pathapatnam: పాతపట్నంలో డిగ్రీ కాలేజీ సమీపంలోని పొలంలో ఏర్పాటు చేసుకున్న వ్యవసాయ డీజిల్ ఆయిల్ ఇంజిన్, పైపులను గుర్తుతెలియని దుండగులు చోరీ చేశారు.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM
Published on: 8 Sept 2026 5:58 PM IST
Pathapatnam
X

Pathapatnam: పాతపట్నంలో వ్యవసాయ డీజిల్ ఇంజిన్ చోరీ: పోలీసులకు ఫిర్యాదు!

పాతపట్నం: పాతపట్నంలోని ట్యాంక్ వీధి నివాసి కంటూబుక్త సూర్యనారాయణ (తండ్రి: లేట్ అప్పన్న) పొలంలో అమర్చిన వ్యవసాయ ఆయిల్ ఇంజిన్, పైపు సెట్టును గుర్తుతెలియని దుండగులు చోరీ చేశారు.

బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... ప్రహరాజపురం రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న తన సుమారు 60 సెంట్ల మెట్ట గుడ్డి భూమిలో సాగు అవసరాల నిమిత్తం నీరు పెట్టేందుకు డీజల్ ఆయిల్ ఇంజిన్, పైపులను ఏర్పాటు చేసుకున్నారు.

మొన్నటి వరకు పొలంలోనే ఉన్న ఇంజిన్, పైపులు సోమవారం ఉదయం వెళ్లి చూసేసరికి కనిపించకపోవడంతో, గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి వేళ చోరీ చేసినట్లు గుర్తించారు.

తన వ్యవసాయం పూర్తిగా ఆ ఇంజిన్‌పైనే ఆధారపడి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఈ చోరీ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులను పట్టుకుని తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితుడు పాతపట్నం పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ (SHO)కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు సమర్పించారు.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM

A.SANTHOSH KUMAR, PATHAPATNAM

Next Story