Parvathipuram: వెలగవాడకు చేరని సాగునీరు క్రాప్ హాలిడేకు రైతుల డిమాండ్!
Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, బూర్జ మండలాల్లో వెలగవాడ రెగ్యులేటర్‌కు సాగునీరు అందక 5 వేల ఎకరాల ఆయకట్టు ఎండిపోతోంది.
Parvathipuram: వెలగవాడకు చేరని సాగునీరు క్రాప్ హాలిడేకు రైతుల డిమాండ్!
Parvathipuram: వరుణుడు కరుణించినా నేటికి వెలగవాడ వద్ద ఉన్న రెగ్యులేటరీకి చేరని నీరు, పాలకొండ ప్రాంతం, బూర్జ మండలల రైతులు ఆశాదీపంఎగుర ప్రాంతానికి సాగునీరందించి కాలువ చివర ప్రాంతానికి సాగునీరందించమనడం జలవనరుల శాఖ చేతకానితనం. నీరివ్వలేమని చెప్పారు కాబటత్టి క్రాప్ హాలీడేగా ప్రకటించండిఅభ్యుదయ రైతు, సీనియర్ సిటిజన్, వాటర్ రిసోర్సర్సాగునీరు విడిచిపెట్టినప్పుడు 10 శాతం వర్షం సహకరిస్తే నీరు సరఫరా చేస్తామని చెప్పితీరా సరఫరా చేయలేమనడం సిగ్గుచేటు..
వెలగవాడ రెగ్యులేటరు వద్దకు రెండున్నర అడుగుల నీరుంటే ఆ రెగ్యులేటర్ ద్వారా నరసింహ చెరువుకు, వడమ డిస్ట్రిబ్యూటరీకి, బూర్జ మండలం పాలవలస, పెద్దపీట వద్ద ఉన్న విత్తన క్షేత్రానికి సాగునీరు సరఫరా జరగాలి. గత పది సంవత్సరాలుగా వెగలవాడ వద్ద ఉన్న పాలవలస డిస్ట్రిబ్యూటరీకి సాగునీరందలేనందున పెద్దపీట వద్ద ఉన్న వరి విత్తన క్షేత్రం మÖతబడ్డది.
ఈ రెగ్యులేటర్ ద్వారా సుమారు 5 వేల ఎకరాలకు సాగునీరందక పోవడం వందలాది మంది రైతులు పంటలు నష్టపోయి అప్పుల పాలవుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వ్యవసాయం పూర్వ వైభవంగా ఉంటుందన్న రైతన్న ఆశలు అడియాశలయ్యాయి. ఎగువ పంటలు పండి, దిగువ రైతులు నష్టపోవడం కూటమి లక్ష్యమా..?సాగునీటి మార్గదర్శక సూత్రాలను జలవనరుల శౄఖ విస్మరించడం వారికి అవగాహన లోపం. నీరు విడిచిపెట్టినప్పుడు మార్గదర్శక ప్రకారం ముందుఆ కాలువ చివర భూములకు దానికి సంబంధించిన గొలుసు కట్టు చెరువులకు నీరు నింపిన తరువాత ఎగువ ప్రాంతానికి సాగునీరు విడిచిపెట్టాలి.
కనీసం 140 దినాలుపైగా నిరంతరంగా సాగునీరు విడిచిపెట్టాలి. జలవనరుల శౄఖకు అవగాహన లేక పోవడం ఆయకట్టు రైతులు దురదృష్టం సబ్ కలెక్టర్‌కు ఇరిగేషన్ అధికారులు సాగునీరు అందించలేమన్నారు. ఇప్పటికే రైతులు దిక్కులు దున్ని విత్తనాలు ఎరువులకు ఎకరాకు పది వేల రూపాయలు ఖర్చు చేశారు. ఎకరా రైతుకు పది వేల చొపున నష్టపరిహారం, బ్యాంకు నుంచి రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ చేయాలని ప్రసాదరావు, రైతాంగం కోరుతున్నారు.




