Palasa: వైసీపీవి గమ్యం లేని రాజకీయాలు.. ఎమ్మెల్యే గౌతు శిరీష ఫైర్

Palasa: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తీవ్రంగా ఖండించారు.

B LOKANADHAM, PALASA
Published on: 28 April 2026 9:36 PM IST
Palasa
X

Palasa: వైసీపీవి గమ్యం లేని రాజకీయాలు.. ఎమ్మెల్యే గౌతు శిరీష ఫైర్

Palasa: వైసీపీ నేతల తీరుపై పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణమంటూ వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలను ఆమె కొట్టిపారేశారు. ఈ మేరకు ఒక పెట్రోల్ బంకు వద్ద ఆమె స్వయంగా పరిస్థితిని సమీక్షించి, మీడియాతో మాట్లాడారు.

వైసీపీ "హైడ్రామా"పై ధ్వజం

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పలాసలో అనవసరంగా హైడ్రామా చేస్తున్నారని శిరీష విమర్శించారు. "మతిలేని పార్టీ, గమ్యం లేని నాయకులు ఉన్న వైసీపీ.. రాష్ట్రంలో ఏ చిన్న సమస్య వచ్చినా దానికి చంద్రబాబు గారే కారణమని చెప్పడం అలవాటుగా మార్చుకుంది" అని ఆమె ఎద్దేవా చేశారు.

నిజం తెలుసుకున్న ప్రజలు

నిన్నటి రోజున వైసీపీ నాయకులు చేసిన తప్పుడు ప్రచారాన్ని నమ్మి ప్రజలు కొంత ఆందోళనకు గురయ్యారని, కానీ నేడు వాస్తవం ఏంటో అందరికీ అర్థమైందని ఆమె తెలిపారు.

పెట్రోల్ బంకుల వద్ద ఎక్కడా భారీ క్యూ లైన్లు లేవని, సరఫరా సాధారణంగానే ఉందని ఆమె స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా దేశానికి రావాల్సిన లోడ్లు కొంత ఆలస్యం కావచ్చని, అంతేకానీ రాష్ట్రంలో ఎటువంటి కృత్రిమ కొరత లేదని వివరించారు.

అప్పలరాజుకు సూటి ప్రశ్న

"అప్పలరాజు గారు తన అనుచరులతో కలిసి పెట్రోల్ బంకుల వద్దకు వెళ్లి హంగామా చేశారు కదా.. మరి మీరు వెళ్ళినప్పుడు మీ బండిలో పెట్రోల్ పోయించుకునే వెళ్లారా? లేక బండి నెట్టుకుంటూ వెళ్లారా?" అని ఎమ్మెల్యే గౌతు శిరీష సూటిగా ప్రశ్నించారు. పెట్రోల్ అందుబాటులో ఉందన్న విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని, వైసీపీ డ్రామాలను ఎవరూ నమ్మరని ఆమె పేర్కొన్నారు.

ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే వైసీపీ నేతలు ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ప్రభుత్వం అన్ని అవసరాలను సక్రమంగా తీరుస్తుందని ఎమ్మెల్యే శిరీష భరోసా ఇచ్చారు.

B LOKANADHAM, PALASA

B LOKANADHAM, PALASA

Next Story