Palasa: అభివృద్ధితో పాటు సంక్షేమమే మా లక్ష్యం.. గౌతు శిరీష!

Palasa: శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ROB నిర్మాణ నిర్వాసితులకు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష చేతుల మీదుగా భూ పట్టాల పంపిణీ జరిగింది.

B LOKANADHAM, PALASA
Published on: 14 July 2026 3:34 PM IST
Palasa
X

Palasa: అభివృద్ధితో పాటు సంక్షేమమే మా లక్ష్యం.. గౌతు శిరీష!

Palasa: పలాస పార్టీ కార్యాలయంలో ఈరోజు పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణం కారణంగా నిర్వాసితులైన కుటుంబాలకు భూ పట్టాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలాస శాసనసభ్యులు శ్రీమతి గౌతు శిరీష పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు భూ పట్టాలను అందజేశారు.

ఈ సందర్భంగా నెమలి నారాయణపురం సర్వే నంబర్–346 మరియు పురుషోత్తపురం సర్వే నంబర్–51లోని భూములకు సంబంధించిన మొత్తం 98 మంది నిర్వాసితులకు భూ పట్టాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష మాట్లాడుతూ, ప్రజల అభివృద్ధి కోసం చేపట్టే ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులైన కుటుంబాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో వ్యవహరిస్తోందన్నారు. అర్హులైన ప్రతి నిర్వాసిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల హక్కులను పరిరక్షించడం తమ బాధ్యత అని తెలిపారు.

ప్రజల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తోందని, అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకెళ్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు ప్రతి అర్హుడికి చేరేలా నిరంతరం కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు, ఏఎంసీ చైర్మన్ మల్ల శ్రీనివాస్ రావు, గ్రంధాలయ చైర్మన్ పీరికట్ల విఠల్ , బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి లోడగల కామేష్ , 11 వ వార్డ్ ఇంచార్జ్ నిత్యానంద పండ, మున్సిపాలిటీ అధ్యక్ష, కార్యదర్శులు మున్సిపాలిటీ తెలుగుదేశంపార్టీ ముఖ్య నాయకులు, ఆర్డీవో గారు ఎమ్మార్వో గారు, నిర్వాసిత కుటుంబాల సభ్యులు మరియు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

B LOKANADHAM, PALASA

B LOKANADHAM, PALASA

Next Story