Palasa: ఆత్మహత్య ఏ సమస్యకూ పరిష్కారం కాదు పలాస ఆసుపత్రి సూపరింటెండెంట్!

Palasa: పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం. సమస్యలు ఉన్నప్పుడు సహాయం కోరడం ధైర్యమని డాక్టర్ పాపినాయుడు సందేశం.

B LOKANADHAM, PALASA
Updated on: 10 Sept 2026 4:35 PM IST
Palasa
X

Palasa: ఆత్మహత్య ఏ సమస్యకూ పరిష్కారం కాదు పలాస ఆసుపత్రి సూపరింటెండెంట్!

Palasa: ఈరోజు స్థానిక ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి పలాస నందు ఐ సి టి సి విభాగం పరిధిలో.. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్. పాపినాయుడు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది.. ముఖ్యంగా ఈ సమావేశంలో సూపరింటెండెంట్ గారు మాట్లాడుతూ ఆత్మహత్య అనేది..ఏ సమస్యకూ పరిష్కారం కాదు. సమస్య వచ్చినప్పుడు సహాయం కోరడం బలహీనత కాదు—అది ధైర్యం.”

యువతలో చదువు, ఉద్యోగం, ప్రేమ, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వైఫల్యాలు వంటి కారణాలతో ఒత్తిడి పెరగవచ్చు. అలాంటి సమయంలో తొందరపడి నిర్ణయం తీసుకోకుండా నమ్మకమైన వ్యక్తితో మాట్లాడాలి, అవసరమైతే వైద్యుడు లేదా మానసిక ఆరోగ్య నిపుణుడిని సంప్రదించాలి.

తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు,యువతలో కనిపించే తీవ్రమైన నిరాశ, ఒంటరిగా ఉండటం, ఆశలేని మాటలు, “బతకాలని లేదు” వంటి సూచనలను నిర్లక్ష్యం చేయకూడదని తెలియజేయడం జరిగినది.. అలాంటి వారిని విమర్శించకుండా శ్రద్ధగా విని, అవసరమైన వైద్య సహాయం అందించాలని సమాజానికి తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ వైద్యులు డాక్టర్. రఘురాం,డాక్టర్. చిన్నిoనాయుడు, డాక్టర్.మేఘన, డాక్టర్. సుశీల, డాక్టర్. మనోహర్, డాక్టర్ రేఖ, డాక్టర్ రమ్య, డాక్టర్. వినోద్, డాక్టర్. తరుణ్, డాక్టర్.జోత్స్నాప్రియ, డాక్టర్.చాందిని, డాక్టర్. స్వరూప్, మరియు ఆసుపత్రి మెడికల్ కౌన్సిలర్ బగాతి.శ్రీకాంత్, హెడ్ నర్స్ ఉమాదేవి, శోభారాణి, పలువురు ఆశా వర్కర్లు స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

B LOKANADHAM, PALASA

B LOKANADHAM, PALASA

Next Story