Palakonda: పాలకొండలో వైఎస్సార్‌సీపీ టౌన్ హాల్ సమావేశం
Palakonda: పాలకొండలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ టౌన్ హాల్ మీటింగ్. ఆగస్టు 6 నుంచి రిలే దీక్షలు.
Palakonda: పాలకొండలో వైఎస్సార్‌సీపీ టౌన్ హాల్ సమావేశం
పాలకొండ: కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మోసపూరిత హామీల అమలు,వాటి ప్రస్తుత పరిస్థితిపై ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవడం లక్ష్యంగా పాలకొండ నియోజకవర్గం పరిశీలకులు శాసనమండలి సభ్యులు శ్రీ పాలవలస విక్రాంత్ గారి ఆధ్వర్యంలో టౌన్ హాల్ సమావేశం నిర్వహించారు .
ఈ సందర్భంగా శ్రీ పాలవలస విక్రాంత్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు,ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు.
పాలకొండ టౌన్ లో ఆగస్టు 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్న రిలే నిరాహార దీక్షల్లో డిఎస్సీ నియామకాలులో బాధితులు, నిరుద్యోగ యువతి,యువకులు, విద్యార్థి సంఘాల నాయకులు, యువజన విభాగం నాయకులు,సోషల్ మీడియా విభాగం యువత,పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని శ్రీ విక్రాంత్ పిలుపునిచ్చారు.ఈ దీక్షల ద్వారా విద్యార్థులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలు,ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని తెలిపారు.
ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన డిమాండ్లను వెల్లడించారు. DSC-2025లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని. DSC పేపర్ లీకేజ్, అవకతవకలకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని.ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలను పూర్తిగా విడుదల చేయాలని.. విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని... పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపట్టి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని శాసనమండలి సభ్యులు శ్రీ పాలవలస విక్రాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ టౌన్ హాల్ సమావేశంలో వీరఘట్టం ఎంపీపీ శ్రీ దమలపాటి వెంకటరమణ నాయుడు ,శ్రీ పొట్నూరు లక్ష్మణరావు పాలకొండ మండల పరిషత్ ఉపాధ్యక్షులు శ్రీ కణపాక సూర్య ప్రకాష్ శ్రీ రణస్థలం రాంబాబు భామిని ఎంపీపీ ప్రతినిధి తోట సింహాచలం బోనిగడ్డ ధర్మారావు ,సీతంపేట మండల కన్వీనర్ కూరంగి వెంకు నాయుడు సవర సాయికుమార్ సవర చంద్రశేఖర రావు సవర మహేష్ గారు,మాజీ కౌన్సిలర్లు,నాలుగు మండలాల పార్టీ అనుబంధ అధ్యక్షులు,పార్టీ అభిమానులు, విద్యార్థులు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




