Palakonda: డీఎస్సీ వివాదంపై కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ !
Palakonda: సీబీఐ విచారణ కోరుతూ పాలకొండలో వైఎస్‌ఆర్‌సీపీ చేపట్టిన రెండో రోజు రిలే నిరాహార దీక్షలకు ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ సంఘీభావం తెలిపారు.
Palakonda: డీఎస్సీ వివాదంపై కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ !
Palakonda: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు మేరకు AP Gen-Z WAR కార్యక్రమంలో భాగంగా డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న ఏఎంజి కన్వర్షన్ హాల్ వద్ద రెండువ రోజు
రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని పాలకొండ నియోజకవర్గ పరిశీలకులు,శాసన మండలి సభ్యులు శ్రీ పాలవలస విక్రాంత్ ప్రారంభించి సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా శాసన మండలి సభ్యులు విక్రాంత్ మాట్లాడుతూ డీఎస్సీ పరీక్షలు రాసిన వేలాది మంది యువత ఆశలను ప్రభుత్వం దెబ్బతీసిందని విమర్శించారు. అర్హత,ప్రతిభ ఆధారంగా జరగాల్సిన ఉపాధ్యాయ నియామకాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని,అందుకే ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఆధారంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (PET) పోస్టులకు అవకాశం ఉండవచ్చని,కానీ అదే సర్టిఫికేట్ ఆధారంగా సోషల్, సైన్స్,ఇంగ్లిష్ వంటి సబ్జెక్ట్ టీచర్ పోస్టులు ఎలా కేటాయించారో ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీతంపేట, భామిని మండలాల పార్టీ నాయకులు, యువజన,విద్యార్థి, విభాగాల నాయకులు,సోషల్ మీడియా కార్యకర్తలు,మాజీ కౌన్సిలర్స్,పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.




