Palakonda: సెప్టెంబర్ 17న పాలకొండలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి భేటీ
Palakonda: సెప్టెంబర్ 17న పాలకొండలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం. ఎమ్మెల్సీ విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి పిలుపు.
Palakonda: సెప్టెంబర్ 17న పాలకొండలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి భేటీ
Palakonda: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రివర్యులు గౌరవ 'శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి' గారి ఆదేశాల మేరకు తే:17.09.2026 దీన, గురువారం మధ్యాహ్నం 3:00 గంటలకు, పాలకొండ పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన ఉన్న ఏఎంజి కన్వెన్సషన్ ఫంక్షన్ హాల్లో 'పాలకొండ నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం' నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు, పాలకొండ నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు గౌరవ శ్రీ పాలవలస విక్రాంత్ మరియు పాలకొండ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, పాలకొండ నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త గౌరవ శ్రీమతి విశ్వాసరాయి కళావతి' నాడు తెలిపారు.
కావున ఈ సమావేశంకు పాలకొండ నియోజకవర్గంకు చెందిన నాలుగు మండలాల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పాలకొండ పట్టణ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, తాజా మాజీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, తాజా మాజీ సర్పంచులు, మాజీ కార్పొరేషన్ అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా స్థాయి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీలలోని సభ్యులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ఉన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగ కమిటీల అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు వైఎస్సార్‌సీపీ అభిమానులు అందరూ ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయవలసిందిగా ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ గారు మరియు పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి గారు మిమ్మల్ని అందర్నీ కూడా మిక్కిలి హృదయపూర్వకముగా కోరుచున్నారు.




