Palakonda: వెంకంపేటలో రెండు రోజుల పాటు నీటి సరఫరా బంద్
Palakonda: పాలకొండ వెంకంపేటలో నూతన పైపులైన్ పనుల నిమిత్తం పలు వార్డుల్లో రెండు రోజుల పాటు నీటి సరఫరా నిలిచిపోనుందని, ట్యాంకర్ల ద్వారా నీరు ఇస్తామని కమిషనర్ తెలిపారు.
Palakonda: వెంకంపేటలో రెండు రోజుల పాటు నీటి సరఫరా బంద్
పాలకొండ: వెంకంపేట పరిధిలో రెండు రోజుల పాటు నీటి సరఫరాకు అంతరాయం వెంకంపేట ప్రాంతంలో AIIB నూతన పైపులైన్ ఏర్పాటు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో, నూతన పైపులైన్ నిర్మాణం కోసం చేపడుతున్న తవ్వకాల కారణంగా భూగర్భంలో ఉన్న పాత పంపింగ్ పైపులైన్లు కొన్ని ప్రాంతాల్లో దెబ్బతింటున్నాయి. దీంతో పైపులైన్ లీకేజీలు ఏర్పడి, వాటికి తరచుగా మరమ్మతులు చేపట్టాల్సి రావడంతో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది.
ప్రస్తుతం వెంకంపేట ట్యాంకు పరిధిలో నూతన పైపులైన్ పనులు కొనసాగుతున్నందున, వార్డులు 1, 2, 11, 12, 17, 18, 19 మరియు 20లకు రెండు రోజుల పాటు కుళాయి నీటి సరఫరా నిలిపివేయబడుతుంది.నూతన పైపులైన్ పనులు పూర్తయిన వెంటనే ఆయా వార్డులకు సాధారణ నీటి సరఫరాను పునరుద్ధరించనున్నట్లు కమిషనర్ తెలిపారు.
ఈ తాత్కాలిక అంతరాయం కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన ప్రాంతాల్లో నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
ప్రజలు ఈ తాత్కాలిక నీటి సరఫరా అంతరాయాన్ని అర్థం చేసుకుని, నూతన పైపులైన్ పనులు త్వరితగతిన మరియు సజావుగా పూర్తయ్యేలా మున్సిపల్ అధికారులకు సహకరించాలని కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.




