Palakonda: కోటదుర్గమ్మ ఆలయంలో వైభవంగా శ్రావణ శుక్రవారం పూజలు

Palakonda: పాలకొండ శ్రీశ్రీశ్రీ కోటదుర్గమ్మ ఆలయంలో శ్రావణమాసం రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ప్రత్యేక పూజలు. సామూహిక లక్ష కుంకుమార్చనలో పాల్గొన్న మహిళలు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 21 Aug 2026 8:30 PM IST
Palakonda
X

Palakonda: కోటదుర్గమ్మ ఆలయంలో వైభవంగా శ్రావణ శుక్రవారం పూజలు

పాలకొండ: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దేవత, పాలకొండ ప్రాంతవాసుల ఇష్టదైవమైన శ్రీశ్రీశ్రీకోటదుర్గమ్మ ఆలయంలో శ్రావణమాసం రెండో శుక్రవారం పూజలు వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈ.ఓ వి.వి. సూర్యనారాయణ పర్యవేక్షణలో ప్రధాన అర్చకులు దార్ల పూడి లక్ష్మీప్రసాదశర్మ ఆధ్వర్యంలో వేకువజామున నాలుగు గంటల నుంచే అమ్మవారికి వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ సువర్ణ కవచాలంకరణ, అభిషేకం, నిత్యార్చన, కుంకుమార్చనలు నిర్వహించారు.

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. సుమారు వేయి మంది మహిళలు సామూహిక లక్ష కుంకుమార్చనలో పాల్గొన్నారు. సాయంత్రం లలితా సహస్రనామ పారాయణం, పంచామృతాభిషేకం, దశవిధ హారతులు, నీరాజనం, మహామంత్రపుష్పం, ప్రత్యేక ప్రసాద వితరణ నిర్వహించారు.

శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఉదయంనుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికితరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అర్చకులు వేమకోటి మణీలశర్మ, ప్రసాదరావు పూజల్లో పాల్గొన్నారు. జూనియర్ అసిస్టెంట్ వి.శ్రీనివాసశర్మ, ఆలయ సిబ్బంది, పోలీసు సిబ్బంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story