Palakonda: పాలకొండలో శక్తి టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన
Palakonda: పాలకొండలో బాలుర వసతి గృహాలను సందర్శించి పోక్సో చట్టం, శక్తి యాప్, చెడు అలవాట్లపై అవగాహన కల్పించిన మహిళా ఏఎస్ఐ ఝాన్సీ భాయ్, శక్తి టీం.
Palakonda: పాలకొండలో శక్తి టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన
పాలకొండ: పాలకొండ శక్తి టీం పాలకొండ టౌన్ లో ఎస్సీ పోస్ట్ మెట్రిక్ బాలురు వసతి గృహము గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బ్యాక్ సైడ్ మరియు ఎస్టి పోస్ట్ మెట్రిక్ బాలురు గృహము వెంకంపేట లకు వెళ్లి విద్యార్థులకు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని మత్తు పదార్థాలు దూరంగా ఉండాలని చెబుతూ పోక్సో చట్టం గురించి వివరిస్తూ 18 సంవత్సరాలు లోపు బాలబాలికలపై ఎటువంటి లైంగిక దాడిల జరిగిన పోస్కో చట్టం వర్తిస్తుందని,
ఆన్లైన్ యాప్స్ అయినా ఫేస్బుక్, ట్విస్టర్ ,ఇంస్టాగ్రామ్ ,లకు దూరంగా ఉండాలని శక్తి ఆప్ గురించి వివరిస్తూ తమ ఇంట్లో ఉన్న అక్క చెల్లి అమ్మల మొబైల్స్ లో శక్తి యాప్ డౌన్లోడ్ చేసి శక్తి యాప్ లో కంప్లైంట్ చేసుకోవచ్చని అవసరమైతే 112 పోలీసు హెల్ప్ లైన్ కు కాల్ చేయమని పాలకొండ శక్తి టీం ఇన్చార్జి అయిన మహిళ ఏఎస్ఐ ఝాన్సీ భాయ్ చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ ప్రకృతాంబ, కానిస్టేబుల్ రాము, పాల్గొన్నారు.




