Palakonda: పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణకు ఆర్టీసీ ఉద్యోగుల వినతి!
Palakonda: ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేట్ పరంచేయొద్దు - ఆర్టీసీ ద్వారానే నడపాలి: పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణకు ఉద్యోగుల వినతి.
Palakonda: పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణకు ఆర్టీసీ ఉద్యోగుల వినతి!
Palakonda: ఆర్టీసీ ఉద్యోగుల వినతి ఎమ్మెల్యే శ్రీ నిమ్మక జయకృష్ణ నూతనంగా ప్రవేశపెడుతున్న ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (RTC) ద్వారానేనిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఉద్యోగుల ప్రతినిధులు గౌరవ పాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నిమ్మక జయకృష్ణ గారిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులు మాట్లాడుతూ, ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే ఆర్టీసీ ఉద్యోగుల భద్రత, ఉపాధి అవకాశాలు మరియు ప్రజలకు అందుతున్న సేవల నాణ్యతపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు.
ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలంటే కొత్తగా కొనుగోలు చేస్తున్న ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ ఆధ్వర్యంలోనే నడపడం సముచితమని అభిప్రాయపడ్డారు.
ఈ విషయాన్ని రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి, ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన విజ్ఞప్తికి సానుకూల నిర్ణయం తీసుకునేలా కృషి చేయాలని ఎమ్మెల్యే శ్రీ నిమ్మక జయకృష్ణ గారిని కోరారు.
వినతిని స్వీకరించిన ఎమ్మెల్యే గారు, ఆర్టీసీ ఉద్యోగుల అభ్యర్థనను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి తగిన విధంగా ప్రతిపాదిస్తానని హామీ ఇచ్చారు.




