Palakonda: పాలకొండలో మానవత్వం చాటిన మున్సిపల్ కమిషనర్!

Palakonda: పాలకొండ మెయిన్ రోడ్డుపై అనాథ యాచికురాలి మృతదేహం. స్వయంగా పాడి మోసి దహన సంస్కారాలు నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ కనకరాజు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 19 July 2026 11:28 AM IST
Palakonda
X

Palakonda: పాలకొండలో మానవత్వం చాటిన మున్సిపల్ కమిషనర్!

Palakonda: పాలకొండ మెయిన్ రోడ్డుపై అనాథ మృతదేహం - పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ పట్టణంలోని మెయిన్ రోడ్డుపై ఈరోజు ఉదయం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. అనాథగా భావిస్తున్న ఈ వ్యక్తి మృతదేహాన్ని గమనించిన స్థానికులు మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే పాలకొండ మున్సిపల్ కమిషనర్ కనకరాజు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని ఆయన స్వయంగా పరిశీలించారు. రోడ్డు పక్కన మృతదేహం ఉండటంతో అటుగా వెళ్లే ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, వెంటనే కమిషనర్ నూకరాజు యాచికురాలి మృతదేహాన్ని స్వయంగా పాడి మోసి దహన సంస్కారాలు స్వయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది మరియు మాజీ కౌన్సిలర్.జవరాజు పాల్గొన్నారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story