Palakonda: పాలకొండలో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవం
Palakonda: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ పట్టణంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర మహోత్సవాలకు దేవాదాయ శాఖ సర్వం సిద్ధం చేసింది.
Palakonda: పాలకొండలో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవం
Palakonda: పాలకొండ పట్టణంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర మహోత్సవం ఏర్పాట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు పూర్తి చేశారు ఈ నెల 16వ తేదీ నుంచి 26వ తేదీ వరకు అంగ రంగ వైభవంగా శ్రీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర ఉత్సవాలు జరిగేందుకు సన్నద్ధం చేశారు ఆలయ కార్య నిర్వహణ అధికారి కొండదాడి పరమేశ్వరి ప్రధాన అర్చకులు వారు మఠం విశ్వనాథం దాస్, మఠం చక్రధర్ దాస్, ఆధ్వర్యంలో పది రోజులు పాటు నిర్వహిస్తున్నారు.
ఈ జగన్నాథ రథయాత్రకు వేలాదిగా పట్టణ ప్రజలతో పాటు గ్రామీణ ప్రాంత ప్రజలు తరలి వస్తారు జగన్నాథ స్వామి వారిని భక్తజనులు దర్శించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లను, మరియు ప్రత్యేక పూజలు చేసే విధంగా ఏర్పాట్లను చేశారు,ఈ ఉత్సవాలకు సంబంధించి జగన్నాథ స్వామి వారి రథం ముస్తాబుతో సిద్ధం చేశారు ఈ రథంపై ఉత్సవమూర్తులు శ్రీ జగన్నాథ స్వామి, వారు బలరామ, స్వామి వారు సుభద్రదేవి, ఊరేగింపుగా గుడిచినాగళ్ళు మందిరం వరకు వెళ్లి అక్కడ ఉత్సవమూర్తులను మందిరంలో తాత్కాలికంగా ప్రతిష్ట చేస్తారు.
ఈ ఆలయంలోనే స్వామివారి దశావతార ఘట్టాలను భక్తజనులకు రోజు ఒక రూపంలో దర్శన భాగ్యాన్ని కలిగిస్తారు అనంతరము ఆలయ విశిష్ట చరిత్రను భక్తులకు కడురమ్యంగా విశ్వనాధ్ దాస్ చక్రిబాబు ఆధ్వర్యంలో వివరిస్తూ ప్రత్యేక పూజలు చేస్తారు. ఆలయాన్ని సుందరంగా అలంకరించి విద్యుత్తు కాంతులతో అలంకరణ చేశారు. ఈ పది రోజులు పాటు ఆలయ ప్రాంగణంలో పెద్ద జాతర జరగనున్నది ఆలయం పక్కన జైంట్ వీల్స్ వివిధ రకాల వినోద కార్యక్రమాలు ఏర్పాట్లను నిర్వాహకులు చేశారు.
దీనితో పది రోజులు పాటు కనుల పండుగగా ఆలయ ఆవరణ కిటకిటలాడే పరిస్థితి నెలకొని ఉంది అందుకు తగ్గట్లుగా స్థానిక డిఎస్పి ఎం రాంబాబు, సిఐ ప్రసాదు, ఎస్సై వెంకన్న,ఆధ్వర్యంలో పటిష్టమైనటువంటి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు పారిశుధ్య నిర్వహణ ఎప్పటికప్పుడు క్లీన్ చేసే విధంగా నగర పంచాయతీ కమిషనర్ నూకరాజు ఏర్పాట్లను పర్యవేక్షణ చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఆలయ ఈవో పరమేశ్వరి మాట్లాడుతూ గ్రామ పెద్దలు అధికారులు భక్తులు సహాయ సహకారములతో ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని ప్రసాదాల విక్రయ కేంద్రం కూడా ఉందని, త్రాగునీటి సౌకర్యము ఉచిత వైద్య శిబిరము ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు, చివరి రోజు మినీమిట్లు గొలిపే విధంగా బాణాసంచా కలుస్తామని వెల్లడించారు.




