Palakonda: సీతంపేట ఏరియా ఆసుపత్రిలో ఐపీహెచ్‌ఎల్ ల్యాబ్ ప్రారంభం
Palakonda: సీతంపేట ఏరియా ఆసుపత్రిలో రూ.1.25 కోట్లతో ఐపీహెచ్‌ఎల్ ల్యాబ్ ప్రారంభం. గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామన్న ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ.
Palakonda: సీతంపేట ఏరియా ఆసుపత్రిలో ఐపీహెచ్‌ఎల్ ల్యాబ్ ప్రారంభం
పాలకొండ: సీతంపేట ఏరియా హాస్పిటల్‌లో PM ABHIM పథకం ద్వారా రూ.1.25 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీ (IPHL) ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే శ్రీ నిమ్మక జయకృష్ణ వర్చువల్‌గా పాల్గొన్నారు.
కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా గారి చేతుల మీదుగా నూతన ల్యాబొరేటరీ ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.మరియు ఆరోగ్య శాఖా మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే శ్రీ నిమ్మక జయకృష్ణ వర్చువల్‌గా పాల్గొని, సీతంపేట వంటి గిరిజన ప్రాంతాల్లో ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఈ నూతన ల్యాబొరేటరీ ద్వారా ప్రజలకు అవసరమైన వైద్య పరీక్షలు వేగంగా, మెరుగైన ప్రమాణాలతో అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే గారు తెలిపారు.
ముఖ్యంగా మారుమూల గిరిజన గ్రామాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా సీతంపేట ఏరియా హాస్పిటల్‌లో మరిన్ని వైద్య సదుపాయాలు, మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.
పాలకొండ నియోజకవర్గంలోని గిరిజన ప్రజలకు మెరుగైన వైద్యం, విద్య, మౌలిక వసతులు అందించడమే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తామని ఎమ్మెల్యే శ్రీ నిమ్మక జయకృష్ణ తెలిపారు.
ఆరోగ్యమే మహాభాగ్యం, గిరిజన ప్రాంతాలకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యం, ప్రజా సంక్షేమమే ప్రథమ కర్తవ్యం
ఈ కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ప్రజలు ,కూటమి నాయకులు కార్యకర్తలు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.




