Nandigam: మా మాస్టార్ బదిలీ ఆపండి ఆనందపురం గ్రామస్తుల ఆందోళన!
Nandigam: నందిగాం మండలం ఆనందపురం పాఠశాల ఉపాధ్యాయుడు గోపాలకృష్ణ బదిలీపై గ్రామస్తుల నిరసన. బదిలీ రద్దు చేయకుంటే టీసీలు తీసుకుంటామని హెచ్చరిక; ఎంఈవో హామీ.
Nandigam: మా మాస్టార్ బదిలీ ఆపండి ఆనందపురం గ్రామస్తుల ఆందోళన!
Nandigam: నందిగాం మండలం ఆనందపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు అక్రమ బదిలీను నిరసిస్తూ ఆనందపురం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు
ఆ ఉపాధ్యాయుడిని బదిలీ చేస్తే కు మా పిల్లల్ని స్కూల్ కి పంపం అంటూ నిరసన వ్యక్తం చేశారు.
TC తీసుకుని వేరే స్కూల్ కి పంపించేస్తాం అంటూ గ్రామస్తులు తెలిపారు.
ఇంటింటికి తిరిగి పిల్లల్ని ప్రభుత్వ బడిలో జాయిన్ చేయమని చెప్పిన ఆ ఉపాధ్యాయుడిని బదిలీ చేస్తే చూస్తూ ఊరుకొం.
ఆయన చెప్పే విద్య బుద్ధులు నచ్చే ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాం.
ఆయన ప్రతి ఇంటికి తిరిగి ప్రైవేట్ పాఠశాల కన్నా ఉత్తమ విద్య ప్రభుత్వ పాఠశాలలోనే అందిస్తామని ప్రతి ఒక కుటుంబానికి భరోసా ఇచ్చి చాలామంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేలా చేసిన ఉపాధ్యాయుడిని బదిలీ చేస్తే పిల్లలు యొక్క జీవితాలు సందిగ్ధంలో పడతాయి.
ఆ ఉపాధ్యాయుడు వలనే పిల్లలకి ఉత్తమ విద్య వస్తుందని నమ్మకం తల్లిదండ్రులు అందరూ ధీమా వ్యక్తం చేస్తున్నారు అని తెలిపారు,
ఆ ఉపాధ్యాయుడు అనుమతి లేకుండా మంచి విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయుడిని బదిలీ చేయడం ప్రభుత్వ పాఠశాల అభివృద్ధిని, బలోపేతాన్ని కాలరాయడమే అని నిరసన చేపట్టారు.
ఆ ఉపాధ్యాయుని బదిలీ చేస్తే కొత్తగా వచ్చే ఉపాధ్యాయుడికి తమ పిల్లలు అలవాటు పడే అవకాశం లేదు అంటున్న తల్లిదండ్రులు వాపోయారు,
ఉత్తమ విద్యను బోధిస్తున్న ఉపాధ్యాయుడిని బదిలీ చేయడం అన్యాయం అంటూ గ్రామస్తుల ఆవేదన చెందారు,
ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఉపాధ్యాయుడు బదిలీ చేయడం ప్రభుత్వ పాఠశాల అభివృద్ధిని కాలరాయడమే అంటూ గ్రామస్తులు తిరుగుబాటు వ్యక్తం చేశారు,
అతను నేను నమ్మి ప్రభుత్వ పాఠశాలలు చేర్పించిన తమకి ఇప్పుడు దిక్కెవరు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు,
అదే ఉపాధ్యాయుడిని కావాలంటూ ఆనందపురం పాఠశాల కి కావాలంటూ M.E.O నర్సింహులు గ్రామస్తుల వినతి పత్రం,
ఉపాధ్యాయుడు బదిలీకి కారణమైన M.E.O కి వ్యతిరేకంగా గ్రామస్తులు నినాదాలు పలికారు,
గ్రామస్తుల పిర్యాదు తో పాఠశాల పర్యవేక్షణ కి వచ్చిన M.E.O 2 చిన్నారావు
గోపాలకృష్ణ అనే ఉపాధ్యాయుడిని తిరిగి ఆనందపురం పాఠశాలలో బోధించే విధంగా చర్యలు తీసుకుంటామంటూ భరోసా ఇచ్చిన M.E.O 2 చిన్నారావు.




