Kanchili: బాధితులను పరామర్శించిన కంచిలి ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి!

Kanchili: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలోని నువ్వాగడ, పెద్దశ్రీరాంపురం గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి పరామర్శించారు.

G.RAMBABU, SOMPET
Published on: 12 Aug 2026 9:44 PM IST
Kanchili
X

Kanchili: బాధితులను పరామర్శించిన కంచిలి ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి!

కంచిలి: కంచిలి మండలంలోని నువ్వాగడ, పెద్దశ్రీరాంపురం పంచాయతీల్లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి పరామర్శించారు. కుటుంబ సభ్యులను కలిసి మృతుల వివరాలను తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

నువ్వాగడ గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు దుప్పుల కోదండరావు తల్లి దుప్పుల బంగారమ్మ (80) మృతి చెందగా, పెద్దశ్రీరాంపురం గ్రామానికి చెందిన లండ పాపయ్య (55), లండ సరోజిని (60), మల్లార్పు కుమారి (45) ఇటీవల మృతి చెందారు. ఆయా కుటుంబాలను ఎంపీపీ పరామర్శించి, క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల ఉపాధ్యక్షుడు తలగాన తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి మడ్డు వెంకటరావు, యువజన అధ్యక్షుడు మడ్డు అభియాదవ్, నియోజకవర్గ ఎస్టీ విభాగం అధ్యక్షుడు ఋషి భుయ, మాజీ సర్పంచులు గణప సింహాచలం, బల్లెడ సుమన్, మాదిన క్రాంతికుమార్, తాండ్లి సురేష్, తలగాన భాస్కరరావు, బల్లెడ సునీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story