Kanchili: మకరాంపురంలో అట్టహాసంగా 'మెగా పీటీఎం 4.0' వేడుకలు!

Kanchili: కంచిలి మండలం మకరాంపురం ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో హెచ్‌ఎం నెయ్యిల హరికృష్ణ ఆధ్వర్యంలో మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ (పీటీఎం) 4.0 ఘనంగా నిర్వహించారు.

G.RAMBABU, SOMPET
Published on: 25 July 2026 6:27 PM IST
Kanchili
X

Kanchili: మకరాంపురంలో అట్టహాసంగా 'మెగా పీటీఎం 4.0' వేడుకలు!

కంచిలి: మండలంలోని మకరాంపురం ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ (పీటీఎం) 4.0 విద్యార్థుల విద్యా ప్రగతి, తల్లిదండ్రుల భాగస్వామ్యానికి వేదికగా నిలిచింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు నెయ్యిల హరికృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, దాతలు, పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు.

సమావేశంలో విద్యార్థుల విద్యా పురోగతి, అభ్యాస స్థాయి, క్రమశిక్షణ, భవిష్యత్ లక్ష్యాలపై తరగతి ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో ముఖాముఖి చర్చించారు. పిల్లల చదువులో తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎంతో కీలకమని వివరించారు. విద్యార్థుల సమగ్రాభివృద్ధికి పాఠశాల చేపడుతున్న బోధనా విధానాలు, విద్యా కార్యక్రమాలను వివరిస్తూ ఉపాధ్యాయులు పలు సూచనలు చేశారు.

ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న నాణ్యమైన విద్య, సౌకర్యాలను ప్రైవేట్ పాఠశాలలతో పోలుస్తూ విద్యార్థులు రోల్‌ప్లే ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. చిన్నారుల ప్రసంగాలు సభికులను అలరించాయి. మోడల్ ప్రాథమిక పాఠశాలగా అభివృద్ధి చెందిన అనంతరం ప్రతి తరగతికి ప్రత్యేక ఉపాధ్యాయుడు ఉండడం, ఒక్కో ఉపాధ్యాయుడు ఒక్కో సబ్జెక్టులో నైపుణ్యం కలిగి ఉండడం వల్ల విద్యార్థులు మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తారని ప్రధానోపాధ్యాయులు హరికృష్ణ తెలిపారు.

ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయిని మాధవి బెహరా తనయుడు వరుణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బందికి గుర్తింపు కార్డులను గ్రామ పెద్దల చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులు, అతిథులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం ముగింపులో విద్యార్థుల తల్లులు నిర్వహించిన మ్యూజికల్ చైర్ పోటీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి సందడి చేసింది.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు టీవీ రమణ, తమరాల కృష్ణారావు,వజ్జ రామారావు,బెందాళం భోగేశ్వరరావు, గొనప కృష్ణారావు, పాఠశాల నిర్వహణ కమిటీ చైర్మన్ మల్ల సుందరరావు, ఉపాధ్యక్షురాలు టేకి కుమారి, అంగన్‌వాడీ సిబ్బంది తమరాల జయమ్మ, సుజాత రౌళో, ఉపాధ్యాయులు దుద్ది బాలరాజు, మాధవి బెహరా, బొడ్డ స్వరూప, పి. భార్గవి, మల్లార్పు భవాని, గ్రామస్థులు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రధానోపాధ్యాయులు నెయ్యిల హరికృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story