Palakonda: పాలకొండ వైఎస్సార్ విగ్రహానికి ప్రాజెక్టుల జలాలతో జలాభిషేకం!
Palakonda: పాలకొండలో తోటపల్లి, మడ్డువలస ప్రాజెక్టుల జలాలతో వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం, జలాభిషేకం చేసిన ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్.
Palakonda: పాలకొండ వైఎస్సార్ విగ్రహానికి ప్రాజెక్టుల జలాలతో జలాభిషేకం!
Palakonda: డాక్టర్ శ్రీ వై.యస్ రాజశేఖరరెడ్డి గారి 17వ వర్ధంతి సందర్బంగా పాలకొండలో కార్గిల్ జంక్షన్ వద్ద వైయస్సార్ విగ్రహానికి తోటపల్లి ప్రాజెక్ట్, మడ్డువలస ప్రాజెక్టుల నుంచి జలాన్ని తీసుకువచ్చి జలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు శ్రీ పాలవలస విక్రాంత్ గారు. అనంతరం పాలకొండ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో వీరఘట్టం జడ్పీటీసీ శ్రీమతి జంపు కన్నతల్లి గారు, వీరఘట్టం ఎంపీపీ శ్రీ దమలపాటి వెంకట రమణ నాయుడు గారు,పాలకొండ వైస్ ఎంపీపీ శ్రీ కణపాక సూర్య ప్రకాష్ గారు, పట్టణ అధ్యక్షులు శ్రీ వెలమల మన్మధరావు గారు,కర్రి లీలాప్రసాద్ గారు,మాజీ కౌన్సిలర్లు,మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు,వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, వైయస్సార్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.




