Palakonda: పాలకొండ వార్డుల వివాదం.. ఈ నెల 29న అఖిలపక్ష సమావేశం కమిషనర్

Palakonda: పాలకొండ నగర పంచాయతీలో వార్డుల విభజన అశాస్త్రీయంగా, అస్తవ్యస్తంగా జరిగిందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ బాబు మండిపడ్డారు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 23 May 2026 3:36 PM IST
Palakonda
X

Palakonda: పాలకొండ వార్డుల వివాదం.. ఈ నెల 29న అఖిలపక్ష సమావేశం కమిషనర్

పాలకొండ: నగర పంచాయతీలో వార్డులు విభజన అస్తవ్యస్తంగా ఉందని శాస్త్రీయతంగా జరగలేదని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ బాబు పేర్కొన్నారు శనివారం నగర పంచాయతీ కమిషనర్ కు వార్డుల విభజన పై విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ విభజనకు ముందు అఖిలపక్షం ఏర్పాటు చేసి అన్ని పార్టీల వారికి మరియు మాజీ కౌన్సిలర్ కు పోటీకి సిద్ధంగా ఉన్నవారికి ముందస్తు సమాచారం ఇవ్వకుండా నిండుగా ఉన్న వీధులను విడగొట్టి అశాస్త్రీయంగా వార్డులను విభజన చేయడం సరికాదని పేర్కొన్నారు.

ఏ ప్రాతిపదికన చేశారో తెలియపరచాలని ప్రశ్నించారు గతంలో 20 వార్డులు సక్రమంగా ఓటర్ జాబితా ప్రకారం ప్రతి వార్డుకి 1000 నుంచి 1100 ఓట్లు వరకు ఉండేవని ఇప్పుడు తాజాగా 28 వార్డులు చేసిన తర్వాత ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి ఏర్పడిందని విభజన చేసి అడ్డగోలుగా వార్డులను కేటాయించారని ఇది సమంజసం కాదని అన్నారు తక్షణమే వీటిపై స్పందించి సరి చేయాలని కోరారు.

ఇదే అంశంపై కమిషనర్ రత్నరాజు స్పందిస్తూ ఇప్పటికీ అన్ని వర్గాల నుంచి అన్ని రాజకీయ పార్టీల నుంచి పూర్తి వ్యతిరేకత ఈ వార్డుల విభజనపైఫిర్యాదులు అందుతున్నాయని ఈనెల 29న అఖిలపక్ష సమావేశం అన్ని పార్టీలకు ముందస్తు సమాచారం ఇచ్చి సమావేశం నిర్వహించడం జరుగుతుందని జవాబు ఇచ్చారు.

ఎమ్మెల్సీ తో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వెలమల మన్మధరావు సీనియర్ నాయకులు పాలవలస ధవళేశ్వరరావు మాజీ కౌన్సిలర్స్ కడగల వెంకటరమణ దుప్పాడ పాపి నాయుడు తూముల లక్ష్మణరావు నీలాపు శ్రీనివాసరావు పల్ల భానుబాబు దుంపల రమేష్ బాబు టేకి రామకృష్ణ భాసూరు కాంతారావు తదితరులు ఉన్నారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story