Palakonda: మహిళా జెడ్పీటీసీకి ఇచ్చే గౌరవం ఇదేనా? ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్
Palakonda: మహిళల రక్షణ అవగాహన సదస్సులో ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందని, స్థానిక ప్రజాప్రతినిధులను విస్మరించడంపై కలెక్టర్‌కు ఫిర్యాదు.
Palakonda: మహిళా జెడ్పీటీసీకి ఇచ్చే గౌరవం ఇదేనా? ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్
పాలకొండ: మహిళలపై నేరాలు ఘోరాలు పట్ల అవగాహన సమావేశం ఏర్పాటుకు ప్రజా ప్రతినిధులకు పిలువకపోవడం శోచనీయమని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ పేర్కొన్నారు శనివారం విక్రాంత్ ఇంటి వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ మహిళలపై జరిగే నేరాలు పట్ల అవగాహన పెంచేందుకు కార్యక్రమంలో కలిసికట్టుగా ఈ తరహా చర్యలను అధిగమించేందుకు చేపట్టిన కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘన గమనరహనీయమని అన్నారు మీ గళం వినిపించి దృఢంగా నిలబడాలంటూ పిలుపునిచ్చిన జిల్లా యంత్రాంగం స్థానిక ప్రజాప్రతినిధులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించక కుండా విస్మరించటం సోచనీయమని పేర్కొన్నారు.
ముఖ్యంగా మహిళల రక్షణకు సంబంధించి జిల్లా ఎస్పీ డిఎస్పి నేతృత్వంలో నిర్వహించిన ఈ వేదికను స్థానిక మహిళ జడ్పిటిసి తో పాటు తనకు సమాచారం ఇవ్వకపోవడం సమంజసం కాదని స్పష్టం చేశారు పోలీస్ అధికారులు మహిళల భద్రత గౌరవానికి కట్టుబడి ఉంటామని చెబుతూ స్థానిక శాసన సభ్యులను ఆహ్వానించి మీరు మహిళ జడ్పిటిసి కి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు.
ఇది కేవలం మహిళ ప్రజా ప్రతినిధిని తనను అవమానించినట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ అంశంపై శనివారం జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్సీ విలేకరులకు తెలిపారు ఆయనతోపాటు జడ్పిటిసి పాలవలస గౌరీ పార్వతి కనపాక సూర్య ప్రకాష్ రౌతు హనుమంతరావు. పాల్గొన్నారు.




