Srikakulam: రైతుల వినతి మేరకు రామి గెడ్డలో గుర్రపు డెక్క తొలగింపు పనులు!

Srikakulam: శ్రీకాకుళంలో రైతుల వినతిపై రామి గెడ్డలో గుర్రపు డెక్క తొలగింపు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే గొండు శంకర్.

Varaprasad, Staff Reporter -Srikakulam
Published on: 16 Sept 2026 1:58 PM IST
Srikakulam
X

Srikakulam: రైతుల వినతి మేరకు రామి గెడ్డలో గుర్రపు డెక్క తొలగింపు పనులు!

Srikakulam: శ్రీకాకుళం పరిధిలోని కొత్త రోడ్ నుండి అరసవిల్లి వరకు ఉన్న రామి గెడ్డ ద్వారా దిగువ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ పొలాలకు సాగునీరు సజావుగా అందేలా చూసేందుకు స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

గత కొంతకాలంగా రామి గెడ్డలో భారీగా గుర్రపు డెక్క పేరుకుపోవడంతో సాగునీటి పారుదలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని, దీనివల్ల తమ పొలాలకు నీరు సరిగ్గా చేరక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానిక రైతులు ఇటీవల ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్లారు.

రైతుల వినతిపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే గారు, అధికారులను అప్రమత్తం చేసి జెసిబి (JCB) యంత్రాల ద్వారా రామి గెడ్డలో గుర్రపు డెక్కను తొలగించే పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా పనులు జరిగే ప్రాంతాన్ని సందర్శించి, పనుల తీరును పర్యవేక్షించారు.

దిగువ ప్రాంతంలోని ప్రతి వ్యవసాయ భూమికి సాఫీగా నీరు అందాలన్న ఉద్దేశ్యంతోనే యుద్ధప్రాతిపదికన ఈ పనులు చేపట్టామని ఆయన తెలిపారు.

అన్నదాతల సంక్షేమమే తమ ప్రథమ కర్తవ్యమని, వ్యవసాయానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు తాము ఎల్లప్పుడూ ముందుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Varaprasad, Staff Reporter -Srikakulam

Varaprasad, Staff Reporter -Srikakulam

మూడు దశాబ్దాలకు పైగా (36 ఏళ్లు) సుదీర్ఘ అనుభవంతో, శ్రీకాకుళం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.