Kanchili: బాధితురాలికి కొండంత అండగా ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ బాబు
Kanchili: చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి నుంచి రూ.1.48 లక్షల ఆర్థిక సాయాన్ని ఇచ్చాపురం ఎమ్మెల్యే, విప్ డాక్టర్ బెందాళం అశోక్ బాబు మంజూరు చేయించి అందించారు.
Kanchili: బాధితురాలికి కొండంత అండగా ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ బాబు
కంచిలి: కంచిలి మండలం పెద్దశ్రీరాంపురం గ్రామానికి చెందిన మల్లార్పు కుమారి తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ బాబు స్పందించి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.1,48,036 సాయం మంజూరు చేయించారు.
మంజూరైన చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎమ్మెల్యేకు, సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లిన తెదేపా మండల పార్టీ అధ్యక్షుడు మాదిన రామారావుకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాదిన సతీష్, మాదిన లజపతి రావు, గున్న ప్రసాద్, లమ్మత రంగారావు, మాదిన కామేష్, బల్లెడ సంజీవ రావు, మాదిన శ్రీధర్, మాదిన భుజింగం, బెందాళం సత్యం, షన్ముఖ రావు తదితర గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Next Story




