Kaviti: కవిటిలో అట్టహాసంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు!
Kaviti: కవిటి మండలం ప్రగడపుట్టుగలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ డాక్టర్ బెందాళం అశోక్ బాబు.
Kaviti: కవిటిలో అట్టహాసంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు!
Kaviti: 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు కవిటి మండలం ప్రగడపుట్టుగలో శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రగడపుట్టుగ ప్రాథమిక పాఠశాలతో పాటు కవిటి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాల్లో శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ డాక్టర్ బెందాళం అశోక్ బాబు, ఎమ్మెల్సీ నర్తు రామారావు పాల్గొని జాతీయ పతాకాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశ స్వాతంత్య్ర కోసం వారు చేసిన పోరాటం, త్యాగాలను నేటి తరం స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుతూ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.
ప్రగడపుట్టుగ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు జాతీయ పతాకాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. జాతీయ గీతాలాపన, దేశభక్తి నినాదాలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోనూ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, ప్రజలు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ కడియాల పద్మా ప్రకాశ్, మాజీ జెడ్పిటిసి బెందాళం రమేష్, తెదేపా మండల పార్టీ అధ్యక్షులు పొందల కృష్ణారావు, సీపాన వెంకటరమణ, యలమంచి నీలయ్య,మండల అభివృద్ధి అధికారి, తెదేపా, వైసీపీ నాయకులు, కార్యకర్తలు,వివిధ శాఖల అధికారులు, కార్యాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.




